YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రివ్యూ : ‘జంబలకిడి పంబ’..!!

 రివ్యూ : ‘జంబలకిడి పంబ’..!!

 బ్యాన‌ర్‌: శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్
 
న‌టీన‌టులు: శ‌్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్, స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.
 
సంగీతం: గోపీసుంద‌ర్‌
కెమెరా: స‌తీశ్ ముత్యాల‌
ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌
స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌
ద‌ర్శ‌క‌త్వం: జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)
నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్
 
క‌థ‌: వ‌రుణ్ (శ్రీనివాస‌రెడ్డి) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. గ్రామ పెద్ద కుమారుడు అత‌ను. ప‌ల్ల‌వి (సిద్ధి)ని ప్రేమిస్తాడు. వారి పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌రు. దాంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వివాహం చేసుకుంటారు. అయితే చిన్న చిన్న పొర‌పొచ్ఛాలు వ‌స్తాయి. దాంతో లాయ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ (పోసాని)ను ఆశ్ర‌యిస్తారు. ఆయ‌న అప్ప‌టికే 99 విడాకులు ఇప్పించి ఉంటాడు. వీరిది 100వ విడాకుల కేసు. ఈ నేప‌థ్యంలో హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడు. ఆత్మ‌గా య‌మ‌పురికి వెళ్లిన అత‌నికి ఓ వింత స‌మ‌స్య ఎదుర‌వుతుంది. త‌న స‌మ‌స్య ప‌రిష్క‌ర‌ణ‌లో భాగంగా అత‌ను వ‌రుణ్‌, ప‌ల్ల‌వి ఆత్మ‌ల‌ను మారుస్తాడు. అక్క‌డి నుంచి ఏమైంది? శ‌రీరం ఒక‌టి, ఆత్మ మ‌రొక‌టిగా ఆ దంప‌తులు ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు ఏంటి? మ‌ర‌లా మామూలుగా మార‌డానికి హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ చెప్పిన స‌ల‌హా ఏంటి? చివ‌రికి భార్యాభ‌ర్త‌లు ఒక‌ట‌య్యారా లేదా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.
 
ప్ల‌స్ పాయింట్స్
శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని న‌ట‌న‌
నేప‌థ్య సంగీతం
కెమెరా
 
మైన‌స్ పాయింట్స్
క‌థ‌నం పేల‌వంగా ఉండ‌టం
ట్విస్టులు లేక‌పోవ‌డం
పాట‌లు ఆక‌ట్టుకునేలా లేక‌పోవ‌డం
 సాగ‌దీత‌గా అనిపించడం
 
విశ్లేష‌ణ‌
చీటికీ మాటికీ గొడ‌వ‌లు ప‌డే దంప‌తులు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న మాట నిజ‌మే. అలాగే కొంత‌మంది స్వార్థ‌ప‌రులైన న్యాయ‌వాదులు దీన్నే అవ‌కాశంగా భావించి డ‌బ్బు సంపాదించ‌డానికే మొగ్గుచూపుతుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా లాక్కొస్తుంటారు. ఇంతా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. ఒక్క క్ష‌ణం ఎదుటివారి స్థానంలో నిలుచుని ఆలోచిస్తే అంతా అదే స‌ర్దుకుంటుంది అని చెప్పే సినిమా ఇది. అయితే లైన్‌గా విన‌డానికి బావుంది కానీ, దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి. పాట‌లు కూడా మెప్పించ‌వు. ఒక‌రి మీద ఒక‌రు ప‌గ ప‌ట్ట‌డం, ఒక‌రి కెరీర్ల‌ను మ‌రొక‌రు నాశ‌నం చేసుకోవాల‌నుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌న్నీ తేలిపోయాయి. ఎక్క‌డా డెప్త్ క‌నిపించ‌దు. ఇద్ద‌రిలోనూ ఉన్న క‌సి క‌నిపించ‌దు. అమ్మాయి ల‌క్ష‌ణాల‌తో శ్రీనివాస‌రెడ్డి, అబ్బాయి ల‌క్ష‌ణాల‌తో సిద్ధి బాగా న‌టించారు.
 
స‌త్యం రాజేశ్ ప్ర‌వ‌ర్తించే విధానం స‌హ‌జంగా ఉంటుంది. హ‌రితేజ పాత్ర బావుంది. వెన్నెల కిశోర్ త‌న ప‌రిధిలో బాగా న‌టించారు. చాలా సంద‌ర్భాల్లో కామెడీ న‌వ్వించ‌లేక‌పోయింది. పాట‌లు ఎప్పుడొస్తాయో, ఎందుకొస్తాయో అన్న‌ట్టు ఉన్నాయి. అమ్మాయిల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడేట‌ప్పుడు సున్నితంగా, హ‌ద్దుమీర‌కుండా తెర‌కెక్కించిన విధానం బావుంది. మ‌లుపులు, కొత్త‌ద‌నం ఏమీ లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు బోర్ ఫీల‌వుతారు. స‌ర‌దాగా ఒక‌సారి చూడొచ్చు.
 
                 రేటింగ్‌: 2/5

Related Posts