విశాఖపట్నం నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నగరాలకు వారానికోసారి రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ నాలుగో వారం వరకు పొడిగిస్తూ, తూర్పు కోస్తా రైల్వే అధికారులు పచ్చజెండా ఊపారు. రైలు నెంబరు 08573 ఈ నెల 26తో గడువు ముగియనుంది. ఆ రైలు జూలై 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు ప్రతీ సోమవారం రాత్రి 10.55 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08574 రైలు ఈ నెల 27 గడువు పూర్తవుతుంది. దాన్ని జూలై 4 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి, ఆ మర్నాడు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. స్టాపేజీలు, బోగీల కాంబినేషన్‌లో ఏ మాత్రమూ మార్పు లేదు.08501 నెంబరు రైలు ఈ నెల 26 లోపు గడువు ముగుస్తుంది. దాన్ని వచ్చేనెల జూలై 4నుంచి సెప్టెంబర్ వరకు 26 వరకు 13 ట్రిప్పులు పొడిగించారు. ప్రతీ మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి ఆ మర్నాడు మద్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08502 రైలు జూలై 5నుంచి 27 వరకు ప్రతీ బుధవారం మద్యాహ్నం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి ఆ మర్నాడు తెల్లవారి 4.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. స్టాపేజీలు, 8 బోగీల కాంబినేషన్‌లో ఎటువంటి మార్పులు లేవని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిసిఎం కో-ఆర్డినేషన్ జి సునీల్‌కుమార్ తెలిపారు.