YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్, పవన్ ట్విట్టర్ లోనే హీరోలు...

లోకేష్, పవన్ ట్విట్టర్ లోనే  హీరోలు...
ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు ఒకలా ఆలోచించ‌రు అంటారు.. అలాంటి వాళ్లు చాలా త‌క్కువ‌గా ఉంటారని చెబుతారు! ఇది రాజ‌కీయాల‌కూ వ‌ర్తిస్తుంది. కానీ అరుదైన విష‌య‌మేంటంటే.. ప్ర‌స్తుతం ఏపీలో ఇద్ద‌రు యువ‌ రాజ‌కీయ నాయ‌కులు ఒక‌లానే ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా మీడియా సూటి ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కోలేక‌నో లేక వారికి అంత స‌మ‌యం కేటాయించలేనంత బిజీలో ఉండ‌ట‌మో తెలియ‌దుగానీ ఈ ఇద్ద‌రూ ఒకే దారిలో వెళుతున్నారు. ప‌వ‌న్, లోకేష్‌.. ఇద్ద‌రూ భావి రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కులే! ఇద్ద‌రి రాజ‌కీయ నేప‌థ్యాలు వేర‌యినా.. ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు వీరు ఎంచుకున్న మార్గం ఒక్క‌టే! అదే ట్విట‌ర్‌!! ఎవ‌రికైనా శుభాకాంక్ష‌లు తెల‌పాల‌న్నా, ఎవ‌రినైనా విమ‌ర్శించాల‌న్నా, ఏదైనా అంశంపై త‌మ అభిప్రాయాలు తెలియ‌జేయాల‌న్నా.. ఇలా సంద‌ర్భ‌మేదైనా ఎక్కువ మంది రాజ‌కీయ నాయ‌కులు వినియోగిస్తున్న సామాజిక మాధ్య‌మం ట్విట‌ర్‌! ట్రెండ్‌కు అనుగుణంగా రాజ‌కీయ నాయ‌కులు కూడా మారుతున్నారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌కుం డా.. వారి ప్ర‌శ్న‌ల‌కు ఉక్కిరిబిక్కిరి అవ్వ‌కుండా ఉండేందుకు కూడా ట్విట‌ర్‌నే న‌మ్ముకున్న వాళ్లు లేక‌పోలేదు. ఇందులో ప్ర‌ధానంగా లోకేష్‌, ప‌వ‌న్ పేర్లు వినిపిస్తుంటాయి. ఇద్దరూ మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే ప్రశ్నలు.. సమాధానాలు..చికాకులు. ఎక్కడ ఎలా దొరికిపోతామోన‌నే చిన్న భ‌యం వీరికి ఉందా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతుంటాయి.సోష‌ల్ మీడియా వేదిక‌గానే తాము చెప్పాల్సిన రెండు ముక్క‌లు చెప్పేసి ఇక మీ ఇష్టం అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ ఇద్ద‌రూ త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై వాడీవేడి విమ‌ర్శ‌లు చేసేందుకు అప్పుడ‌ప్పుడూ మైకులు వినియోగిస్తుంటార‌ని.. ఎక్కువ‌గా ట్విట‌ర్‌లోనే విమ‌ర్శ‌లు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తుంటాయి. అయినా వాటిని ప‌ట్టించుకోకుం డా త‌మ దారిలోనే వెళిపోతున్నారు మంత్రి లోకేష్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌!!లోకేష్ పబ్లిక్ మీటింగ్ ల్లోనే దొరికిపోతుంటారు. చాలా సంద‌ర్భాల్లో త‌డ‌బడి.. త‌ర్వాత నాలిక క‌రుచుకున్నారు. ఎంత పెద్ద విషయం ఉన్నా.. ప్రత్యర్ధులపై విమర్శలు చేయేటానికి.. అవకాశాలను అందిపుచ్చుకోవటానికి నారా లోకేష్ మీడియా ముందుకు రారు. ఎప్పుడైనా పొరపాటున వచ్చినా తాను చెప్పాల్సింది చెప్పేసి ఎంచక్కా వెళ్లిపోతారే త‌ప్ప మీడియా ప్ర‌శ్న‌లు అడిగేందుకు అవ‌కాశం ఇవ్వ‌నే ఇవ్వ‌రు. ఇక ప‌వ‌న్ కూడా సేమ్‌టు సేమ్ ఇదే దారి! తొలి నుంచి ప‌వ‌న్ ట్విట‌ర్‌లోనే త‌న కార్యాచ‌ర‌ణ అంతా ప్ర‌క‌టిస్తుంటారు. ఈ మ‌ధ్య ప‌బ్లిక్ మీటింగుల్లో క‌నిపిస్తున్నా.. పంథా మాత్రం మార్చుకోలేద‌ని మ‌రోసారి రుజువైంది. కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆ సమయంలో కనీసం ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడని పవన్ తాపీగా ట్విట్టర్ లో కామెంట్లు పెట్టారు.ఏ విషయంలో అయినా అంతా అయిపోయాక స్పందించటం పవన్ అలవాటుగా మారిపోయింద‌నే విమ‌ర్శ‌కుల వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూర్చాడు. టీటీడీ వివాదం చాలా వరకూ సద్దుమణిగిపోయింది. సడన్ గా పవన్ వచ్చి విషయం నిగ్గుతేలాల్సిందే.. సీబీఐ విచారణ జరపాల్సిందే అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించడం న‌వ్వుల‌పాలు చేస్తోంది. ఏదైనా అంశం పై మాట్లాడటానికి అటు లోకేష్, ఇటు పవన్ లు ముందస్తు కసరత్తు ఏ మాత్రం చేయరని, అందుకే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఓ సీనియర్ నేత విశ్లేషించారు. ఓ గంట పాటు కసరత్తు చేస్తే చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పి బయటపడొచ్చని.. కానీ ఈ నేతలిద్దరూ ట్విట్టర్‌నే నమ్ముకున్నారని చెబుతున్నారు.

Related Posts