YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆమ్ ఆద్మీకి కష్టాలు..!!

ఆమ్ ఆద్మీకి కష్టాలు..!!
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభ మసకబారుతోందా? ప్రతి దానికీ కలహాలు, కేంద్రంపై ఆరోపణలు, సమస్యలను పరిష్కరించలేకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రతిబింబించనున్నాయా? అంటే అవుననే చెబుతున్నారు. ఉన్నతాధికారిగా ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. హస్తిన ప్రజలు ఆయనకే అధికారాన్ని కట్టబెట్టారు. కానీ పార్టీ గెలిచి మూడేళ్లుగడుస్తున్నా ఢిల్లీ సమస్యలు అనేకం పరిష్కారానికి నోచుకోలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన మంత్రి వర్గ సహచరులతో సహా అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకోవడం కూడా కేజ్రీవాల్ క్రేజ్ తగ్గడానికి కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.తాజాగా జరిపిన సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలేనని తేలింది. ఏబీపీ న్యూస్-సీ ఓటరు సర్వే ఇటీవల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరి వైపు నిలుస్తారని ప్రజలను ఈ సర్వేలో ప్రశ్నించారు. అయితే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మధ్య పోరు రసవత్తరంగా ఉండేదని సర్వేలో తేలింది. విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమేనన్నట్లు ఫలితాలు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ బలం పెరగనుందని తేలింది.ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి 38 శాతం ఓట్లు లభించాయి. అంటే రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క శాతమే. గతంలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 54.3 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీజేపీకి 32.3 శాతం ఓట్లు దక్కాయి. అయితే ఈ తాజా సర్వేలో బీజేపీ బలం సుమారు ఆరు శాతం పెరగ్గా, ఆమ్ ఆద్మీపార్టీకి దాదాపు 15 శాతం ఓట్లు తగ్గడం విశేషం. అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం పనితీరుపై 67 శాతం మంది ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. లోక్ సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే బీజేపీదే విజయమని తేలింది. లోక్ సభ ఎన్నికల విషయంలో 40 శాతం మంది ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపగా, 25 శాతం మంది ఆప్ పక్షాన నిలబడ్డారు. 24 శాతం మంది కాంగ్రెస్ కే జై కొట్టారు. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టిపోటి ఇస్తుందన్న ఈ ఫలితాలు ఆ పార్టీని ఆలోచనలో పడేశాయి.

Related Posts