పైలెట్ భార్య :
నా దగ్గర మరీ అంతలా ఎగరకండి..
డాక్టర్ భార్య :
ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు..
టీచర్ భార్య :
నాకే క్లాసులు పీకాలనుకోవద్ధు..
జడ్జి భార్య : ఇది చెప్పడానికి వాయిదాలెందుకు,
నేను చెప్పేదే ఫైనల్..
న్యాయవాది భార్య : ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటుంది..
యాక్టర్ భార్య :
ఈ మాత్రం యాక్షన్ మాకూ వచ్చు..
ఇంజనీర్ భార్య :
ప్లాన్లు వేయడం మాకూ తెలుసు..
సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య :
మీ ఆఫీస్ లో ఉన్న ఏంటి వైరస్ కి ఏ సాఫ్ట్ వేర్ వాడాలో నాకు బాగా తెలుసు..
పొలిటీషియన్ భార్య :
మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మ నాన్నలతో అత్యవసర సమావేశం పెట్టి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా..
వ్యాపారి భార్య :
మీ పత్తేపారం బయట చూపించండి, నాకాడ కాదు..
జర్నలిస్ట్ భార్య :
మీ కవరేజులు మీ ఛానెల్ లో చూపించుకోండి, ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్ కవరేజ్ ని నేను వీధిలో చూపించాల్సి ఉంటుంది..