సరికొత్త కాన్ స్టెప్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్-2 ప్రబంజనం సృష్టిస్తుంది. ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తుండటం తో కేవలం ఒక్క వారం లోనే 60 శాతం వీక్షకులను సంపాదించుకోవడమే కాకుండా వారి మనసులను దోచేసింది.ప్రారంబమైన రోజునే 15 టివిఅర్ లను సాదించింది.బిగ్ బాస్ షో పట్ల మొదటి నుండి పాజిటివ్ టాక్ ఉంది.మీడియా తో పాటు లక్షలాది మంది ప్రేక్షకులు బిగ్ బాస్ రెండవ షో కోసం వేచి చూసారు.ప్రేక్షకుల ఆదరాభి మానాలను చూరగొన్న స్టార్ మా, వారి ఆకాంక్షలను వమ్ము చేయకుండా వినూత్న రీతిలో షో ను కొనసాగిస్తుంది.షో మొదలై వారం రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో స్టార్ మా ప్రతినిధులు మాట్లాడుతూ హాట్ స్టార్ వంటి డిజిటల్ మీడియాలో షో ని చూడడానికి ప్రక్షకులు ఎగబడటం మాకెంతో ఉత్సహాన్నిఅందిస్తుందన్నారు. ఈ నెల 20 వ తేదినాటికి హాట్ స్టార్ ద్వారా 23 లక్షల మంది వీక్షకులకు చేరువైన్దన్నారు.గత సంవత్సరం తో పోల్చితే 109 శాతం ఎదుగుదలను నమోదు చేసిందన్నారు.సీజన్-2 రేట్టింగ్ 15 టివిఆర్ సాదించి 2018 లో అతిపెద్ద బ్లాక్బస్టర్ గా అవతరించిందన్నారు.వారాంతాలలో రాత్రి 9 గంటల నుండి 10-30 గంటల వరకు, మిగిలిన రోజుల్లో 9-30 గంటల నుండి 11-30 గంటలవరకు ప్రసారమవుతుందని చెప్పారు.గీతామాదురి,అమిత్ తివారి,దీప్తి,తనీష్,బాబు గోగినేని,బాను,రూల్ రిడా,శ్యామలా,కిరీటి,సునయన,కౌశిక్,సామ్రాట్,గనేష్,సంజన నూతన్ నాయుడు,వంటి 16 మంది సబ్యులుగా ఈ షో మొదలైనట్లు వారు తెలిపారు.