YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరో వివాదానికి తెర తీసిన రమణ దీక్షితులు

మరో వివాదానికి తెర తీసిన రమణ దీక్షితులు
టీటీడీ వర్సెస్ రమణ దీక్షితులు వివాదం రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. శ్రీవారి ఆభరణాల విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన ఆయన.. అర్చకుల భోజనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. తిరుమలలో అర్చకుల భోజనాల విషయం పట్టించుకున్నారా..? అని ఆయన టీవీ ఛాన్సల్‌ను నిలదీశారు. ఈ విషయం పదేపదే టీటీడీ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించే ఈ యజ్ఞంలో మీరంతా నాకు అండగా నిలవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఇంతకు ముందు మీడియా సమావేశం నిర్వహించినప్పుడు నా వెనుక ఉన్నదెవరో తెలీదని రమణ దీక్షితులు తెలిపారు. ‘ఆ సమయంలో నా వెనుక అనిల్ అనే వ్యక్తి ఉన్నాడని.. అన్య మతస్థుడని టీవీ ఛాన్సల్ ప్రచారం చేశాయి. నా డిమాండ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చారంటూ ఆయన ఛానెళ్ల వైఖరిని ప్రశ్నించారు. మీడియా సమావేశానికి ముందు అనిల్ అనే వ్యక్తి వచ్చి ఈ విషయంలో పిల్ వేయాలని అనుకుంటున్నామని చెప్పాడు. దీంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికి నేను సమ్మతించాను. అంతకు ముందు ఆయన్నెప్పుడూ నేను కలవలేద’ని రమణ దీక్షితులు తెలిపారు. మరోవైపు రమణ దీక్షితుల తీరుకు నిరసనగా టీటీడీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. స్వామి వారికి ఇన్ని దశాబ్దాలపాటు సేవ చేసిన మీరు.. భక్తులకు అనుమానం కలిగే రీతిలో ఎందుకు మాట్లాడుతున్నారని రమణ దీక్షితులను టీటీడీ జేఈవో ప్రశ్నించారు. కైంకర్యాలు, తోమాల జరిగే సమయంలో అధికారులెవరూ జోక్యం చేసుకోరని టీటీడీ స్పష్టం చేసింది. 

Related Posts