YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మిడిల్ క్లాస్ కు జనసేన ఆఫర్

మిడిల్ క్లాస్ కు జనసేన ఆఫర్

విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు రాజకీయాలకు దూరంగా పారిపోవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. సగటు మధ్యతరగతి పౌరుడు రాజకీయాల పట్ల ఆశను కోల్పోతున్నాడని చెప్పిన పవన్.. తాను కూడా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని తెలిపాడు. మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోయే కంటే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడాలనే తాను నిర్ణయించుకున్నానని జనసేనాని తెలిపాడు. మన జీవితాన్ని అనునిత్యం ప్రభావితం చేసే రాజకీయాలకు దూరంగా జరగొద్దని పవన్ పిలుపునిచ్చారు. పోరాడకపోతే.. మనల్ని వెన్నెముక లేని వారిలా మార్చేస్తారు. పోరాట స్ఫూర్తిని వీడొద్దు. రాజకీయాల్లో దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో చురుగ్గా మారాలని కోరుకుంటున్నా. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వర్గం పోరాడింది. మధ్యతరగతి ఎదగాలని ఆశిస్తున్నా. మన మాతృభూమికి వారి భాగస్వామ్యం అవసరం’ అని పవన్ ట్వీట్ చేశారు. జనసైనికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయిలో రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పవన్ తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి దీనికి శ్రీకారం చుడతామన్నారు. జూన్ చివరి నుంచి జనసేన వ్యూహకర్త దేవ్ ఆధ్వర్యంలో విశాఖలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని జనసేనాని చెప్పారు.పోరాటం చేసేవారికి తెగువతోపాటు సమర్థత, విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ నాతో ఎప్పటికీ ఉండేది మీరేనని జనసైనికులను ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు. 

Related Posts