తెలుగునాట ఇప్పుడు ఎవరినోట విన్నా ఒక్కేటే మాట.. బిగ్ బాస్... బిగ్ బాస్... బిగ్ బాస్.. బిగ్ బాస్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ కావడంతో.... బిగ్ బాస్ సీజన్ 2పై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. బిగ్‌బాస్ సీజన్1లో హోస్ట్ గా స్టార్ హీరో ఎన్టీఆర్‌ని తీసుకోవడం.. కంటెస్టెంట్స్ గా అందరూ సెలబ్రెటీస్‌నే తీసుకోవడంతో మంచి విజయం సాధించింది. బిగ్ బాస్ సీజన్ ఒన్ తో పోలిస్తే సీజన్ 2 వీక్షకులను ఆకట్టుకుంటుందా... రేటింగ్స్ ఎలా ఉన్నాయి. అసలు బిగ్‌బాస్ సీజన్ 2హిట్టా పట్టా...? ఆ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం...బిగ్ బాస్ 2 రియాలిటీ షో ప్రారంభమై సరిగ్గా నేటికి 14 రోజులు. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఈ షోకు న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. సీజన్ 1లో జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అభిమానులనే కాదు, కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులను అలాగే నెటిజన్లను ఆకట్టుకున్నాడు.... దీంతో బిగ్‌బాస్ 1 సూపర్ హిట్ అయ్యింది. అయితే సినిమాలతో బిజీ బిజీగా ఉన్న జూనియర్ ఈ సీజన్ 2కు హోస్ట్ గా చేయకపోవడంతో స్టార్ మా యాజమాన్యం ఆప్లేస్‌ని భర్తీ చేయడానికి నానిని ఎంచుకోవడం జరిగింది. ప్రోమోల్లో ఈసారి ఇంకాస్త ఘాటుగా అంటూ షోపై మంచి బజ్ నే పెంచేశాడు నాని... అయినా కూడా ఎన్టీఆర్ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడా లేదా అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. షో ప్రారంభానికి ముందు... ఆ తరువాత నాని హోస్ట్ గా వ్యవహరించడం పై కొన్ని విమర్శలు కూడా నెట్టింట్లో సందడి చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్‌లో నాని హోస్ట్ గా రాణించలేకపోతున్నాడని... హౌస్‌మేట్స్‌తో ఎన్టీఆర్‌లా కలుపుగోలుతనంగా వ్యవహరించలేకపోతున్నాడని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిగ్‌బాస్ సీజన్2లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన కంటెస్టెంట్ సంజనా కూడా ఎన్టీఆర్ హోస్టింగే బాగుందని చెప్పడం, అభిమానులు కూడా ఎన్టీఆర్‌లో ఉన్న చలాకితనం నానీలో లేదని భావిస్తున్నట్లు నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిగ్‌బాస్ సీజన్ 2మొదలై ఈ రోజుకి 14 రోజులు.... ఈ 14 రోజుల పాటు బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షో ఎలా ఉంది. రేటింగ్ పరిస్థితి ఏంటి అనే విషయాలను స్టార్ మా ప్రకటించింది. 15.1 రేటింగ్‌తో ఈ షో ప్రారంభమైందని... ఎంతమంది చూశారనే విషయానికొస్తే షో ప్రారంభం రోజున ప్రతి ఇద్దరిలో ఒకరు చూశారని...ఓవరాల్‌గా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 60శాతం మంది ఈ షోని వీక్షిస్తున్నట్లు స్టార్ మా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది.టీవీ కార్యక్రమానికి సంబంధించి బిగ్‌బాస్ సీజన్2కి ఈ రేంజ్‌లో రేటింగ్ రావడం చాలా అరుదేనని స్టార్‌మా చెబుతున్నప్పటికీ... మొదటి సీజన్ సమయంలో ఎన్టీఆర్ హోస్ట్ గా చేసినప్పుడు ఇదే రియాల్టీ షో ప్రారంభంలో 16 రేటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత ఎన్టీఆర్ షో మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ రేటింగ్‌ని అమాంతం పెంచేశాడు. సీజన్2లో వీక్షకుల్ని ఆకట్టుకోవడానికి నాని ప్రయత్నం చేస్తున్నప్పటికీ... ఎన్టీఆర్ కున్న కామెడీ టైమింగ్‌కి, స్పాన్‌టెనిటీ ముందు నాని తేలిపోతున్నాడని కొంతమంది బిగ్‌బాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బిగ్‌బాస్ సీజన్1లో కంటెస్టెంట్స్ అందరూ వీక్షకులకు తెలిసిన వారే... కాని సీజన్2లో కొంతమంది కామన్ మెన్స్ ని కూడా తీసుకోవడం, సెలబ్రెటీస్‌లో కూడా కొంతమంది అందరికీ సుపరిచితులు కాకపోవడంతో బిగ్‌బాస్ 2 జనరంజకంగా లేదని కొంత మంది పెదవి విరుస్తున్నారు.ఏదిఏమైనప్పటికీ బిగ్‌బాస్ సీజన్1 తో పోల్చుకుంటే సీజన్2లో కంటెస్టెంట్స్ విషయంలోనూ, హోస్ట్ విషయంలోనూ అభిమానులు నిరాశకు గురవడం.... రేటింగ్ విషయంలో కూడా సీజన్1తో పోలిస్తే సీజన్2లో వెనకబడిపోవడంతో స్టార్ మా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాస్త స్పైసీనెస్ ను యాడ్ చేస్తూ... బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలను ప్రోమోలుగా విడుదల చేస్తూ ప్రేక్షకులకు ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి కావస్తుండటంతో.. ఇకనుంచైనా ప్రేక్షకులను మరింత అలరించడానికి, రేటింగ్‌ను పెంచేందుకు... నాని మరింత పట్టుదలతో ముందుకెళ్తున్నాడని తెలుస్తుంది. మరి మున్ముందు నాని ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడో వేచిచూడాల్సిందే...