YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుంది         ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అలవికాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.    జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు  కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కృతజ్జ్ఞతలు తెలిపారు.  ఉండవల్లిలోని ప్రజావేదికకు పెద్దసంఖ్యలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును అంగన్వాడీ టీచర్లు   కలిసారు.  మంత్రి పరిటాల సునీత,   మహిళా శిశిసంక్షేమ శాఖ అధికార్లు, మహిళా నేత రాణిలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడారు.   ఒక పార్టీ వరుస ఎన్నికల్లో గెలిచి  అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని సీఎం చంద్రబాబు  పేర్కొన్నారు. "రాష్ట్రంలో ఇప్పటికే 75శాతం ఉన్న  సంతృప్తి 90 శాతానికి  పెంచాలన్నదే లక్ష్యం. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి మీ అందరూ అండగా నిలిస్తే  ప్రతిపక్షం అనేది ఉండద"న్నారు. ప్రజలు తెలుగుదేశం   పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే 25 ఎంపీ సీట్లు సాధిస్తుంది . అప్పుడు ప్రధానిని మనమే నిర్ణయిస్తాం. ఫలితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు లభిస్తాయి. కేంద్రం నుంచి విభజన హామీలను దబాయించి సాధించవచ్చు.   దాంతో ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా ప్రజల జీవనప్రమాణాలు అధికం అవుతాయి. చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గ్రామాల్లో చాటాలని అంగన్వాడీ టీచర్లకు   సీఎం చంద్రబాబు విశిదం చేశారు. కేంద్రం వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. కేంద్రం జీఎస్టీ అమలు, నోట్ల రద్దు   చేయడం    వలన దేశప్రజలందరికీ కష్టాలు వచ్చాయన్నారు. నాలుగేళ్ళలో కేంద్రం సహకరించకపోయినా అంగనవాడీ టీచర్ల, ఆయాల బాధలను తొలగించేందుకు జీతాలు రూ. 10500, రూ.6000కు పెంచామని  ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.  పేదవాళ్ళకు అండగా ఉండాలనే లక్ష్యంతో  అంగన్వాడీ, ఆయాల వేతనాలు పెంచామన్నారు. అంగన్వాడీలు ఆనందంగా ఉంటే వారు పెంచే పేద  పిల్లలు ఆరోగ్యంతో ఎదుగుతారన్నారు.తద్వారా వారి తల్లిదండ్రులు చివరకు సమాజం సంతోషంగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం, బంధుత్వంతో సంబంధం లేకుండా పేదరికాన్ని తొలగించడానికే అంగన్వాడీ టీచర్లు, ఆయా లకు జీతాలు పెంచామన్నారు. నాలుగేళ్ళలోసంపదసృష్టించగలగడంతోనేసమాజంలోఆనందచూడగలుగుతున్నామన్నారు.        2018-19 ఏడాదిని పేదపిల్లల్లో పౌష్టికాహారం లోపం లేకుండా  పెంచాలన్న లక్ష్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. పోరాటం చేయాల్సిన అవసరం లేకుండా జీతాలు పెరగడంతో అంగన్వాడీ టీచర్లలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఆనందం కనపడుతోందన్నారు.   అంగన్వాడీ టీచర్ల సమస్యలన్నింటినీ తొలగించి నిరంతరం అండగా ఉంటామనిహామీఇచ్చినసీఎంచంద్రబాబు అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశానికి అంగన్వాడీ టీచర్లు అండగా ఉంటారన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.  "క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు క్రమశిక్షణతో పని చేస్తున్నారు.    పేదపిల్లలను ఆరోగ్యపరంగా, విద్యాబుద్ధులు నేర్పించడంలో చక్కగా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత   విభజిత రాష్ట్రంలో లెక్కలేనన్ని సమస్యలు చుట్టుముట్టాయి. రాజధాని, ఆదాయం లేదు.   పేదవాళ్ళు  రేషను, ముదుసలులు పింఛను రాదని భయపడ్డారు.   పాలనలో అనేక కష్టాలున్నా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డాం. మీఅందరి సహకారంతో  సమస్యలను తొలగించుకుంటూ అభివృద్ధికి బాటలు పరిచాం. సంక్షోభంలో సమర్థతతో సమస్యలను ఒక్కోటీ పరిష్కరించుకుంటూ వచ్చాం.  నాలుగేళ్ళలో కేంద్రం సహకరించలేదు. రాష్ట్రానికి రావాల్సిన అనేక విద్యాలయాలు, సంస్థలను కేంద్రం నెలకొల్పలేదు. రైల్వే జోన్  , స్టీల్ ప్లాంట్ స్థాపనలో రిక్తహస్తం చూపారు. పోలవరం నిర్మాణానికి అనేక ఆంక్షలు, నిబంధనలతో ఆటంకం కల్పిస్తున్నారు. అయినా మనమే పోలవరం ప్రాజెక్టును పట్టుదలతో, సొంత నిధులతో నిర్మాణం ఆగకుండా పూర్తి చేయడానికి  శతవిధాలా  కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో కరవు నివారణకు, నీటి భద్రతకు పోలవరం నిర్మాణం శరణ్యం. పోలవరం నిర్మాణం పూర్తితో నీటి సమస్యకు చరమగీతం పాడవచ్చు. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అంగన్వాడీ టీచర్లలో పేదలున్నారు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించాను. నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా     అంగన్వాడీ టీచర్లు కష్టాలు పడకూడదని  తలచాను. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ల జీతాలను రూ.4200 నుంచి 7000,  ఇప్పుడు రూ.10500కు పెంచాం. ఆయాలకు కూడా గతంలో ఉన్న రూ. 2500, రూ.4500 ఇప్పుడు రూ. 6000 కు పెంచాం.   ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ.305   కోట్ల భారం పడుతుంది.  అంగన్వాడీ టీచర్ల ఆనందంగా ఉండటమే లక్ష్యంగా సాహసోపేతమైన జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నాం. జీతాల పెంపుతో     అంగన్వాడీ టీచర్లలో ఆనందం, ఉత్సాహం కనపడటం సంతోషకరం.  ప్రతి ఒక్కరికీ ఆర్థిక వెసులుబాటు ఉంటే    ఆయా వృత్తులు, పనుల్లో మెరుగైన ఫలితాలు సాధ్యం.  ఒకపక్క ఇల్లు, మరోపక్క పేదపిల్లలను చూసుకునే  అంగన్వాడీ టీచర్ల  కు ఆర్థిక మద్దతు ఇవ్వాలని భావించి జీతాలు పెంచడం జరిగింది.   భవిష్యత్తు భావీభారత పౌరులైన పిల్లలను తీర్చిదిద్దే   బృహత్తర    బాధ్యతను నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు అండగా నిలవాలని భావించా.  గర్భంలో శిశువు ప్రాణం పోసుకున్నప్పటి నుంచీ మనిషి ప్రాణంపోయి స్మశానానికి తీసికెళ్ళినా  ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు అమలు చేస్తున్నాం. గర్భిణీస్త్రీలు, పుట్టిన శిశువులు చనిపోకూడదు. సురక్షిత ప్రసవానికి   తల్లీబిడ్డా ఎక్స్ ప్రెస్ ప్రవేశపెట్టాం.  పుట్టిన   పిల్లలు   చనిపోవడం అంటే అది అభివృద్ధి చెందిన సమాజం కాదు. అందుకే శిశు రక్షణ బాధ్యతను ప్రతిష్టగా తీసుకోవాలి. ప్రతి పంచాయతీలోనూ చేరువలోనే పౌష్టికాహారం అందించడానికి కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి  పోషకాహార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.     అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరిస్తున్నాం .  అందంగా తీర్చిదిద్దుతున్నాం.      కార్పొరేట్ రెస్పాన్స్బులిటీ కింద వివిధ సంస్థల సహకారం, భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే టాటా సర్వీసెస్ ద్వారా    కొన్ని గ్రామాలను దత్తతకు ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలకు సాయం అందిస్తున్నాం.     కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో   చేరిన పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. దేశ నాయకులు, ప్రాంతాల పేర్లు చెప్పగలుగుతున్నారు. అంగన్వాడీ టీచర్ల శ్రమ వృథా పోవడం లేదు.అందుకు తగ్గట్లుగా టీచర్లకు శిక్షణ కూడా ఇస్తున్నాం. ప్రతి అంగన్వాడీ కేంద్రాలకు ఆడుకునే స్థలాలను ఏర్పాటు చేయాలి. అభివృద్ధి చెందిన ఫిన్లాండ్ వంటి దేశాల్లో పిల్లలకు ఆటలు, విజ్జ్ఞానం అందిస్తున్నారు. పిల్లలో టీం బిల్డింగ్ నేర్పాలి. ఆహారం తీసుకోవడం, పరిసరాలు పరిశుభంగా ఉంచడం వంటివన్నీ ఆటల ద్వారా నేర్పాలి. పిల్లలు ఇష్టమైన పని చేయిస్తూ అన్ని విషయాలు నేర్పాలి. పిల్లలను శక్తివంతంగా తీర్చిదిద్దాలి. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో    సిమెంట్ రోడ్లు, కరెంట్ సరఫరా, గ్యాస్, మరుగుదొడ్లు, బయో మెట్రిక్ ద్వారా రేషన్ సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నాం.  వృద్ధ్యాప్య పింఛను రూ.200 నుంచి రూ. 1000కు పెంచి ఇస్తున్నాం. వృద్ధులను తమ సొంత పిల్లలు చూసుకోని దురదృష్టకర పరిస్థితుల్లో ఇంటి పెద్దకొడుకుగా ఆదుకుంటున్నాను. డ్వాక్రా మహిళలకు రూ. పది వేల ఆర్థిక సాయం, రైతులకు రూ. 24  వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఎస్సీ, ఎస్టీ ల ఇళ్ళకు 75యూనిట్ల కరెంట్ ను ఉచితంగా అందిస్తున్నాం. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాం. ప్రజలందరి సహకారంతో వినూత్న పథకాలు, పనులతో  అభివృద్ధిని సాధిస్తున్నాం. అనంతపురము జిల్లాలో16 ఏళ్ళుగా కరువును ఎదుర్కొంటోంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురము జిల్లాకు నీటి వసతి పెంచాం. భూగర్భజలాలు సైతం పెరిగాయి. ఇప్పుడు మే నెలలో కూడా అనంతపురము జిల్లా యావత్తు చెరువుల్లో నీటినిల్వను చూడగలుతున్నాం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి భద్రత కల్పించాం. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం. త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి జగ్గయ్యపేటకు నీళ్ళుఅందిస్తాం. అంగన్వాడీ టీచర్లు ఆర్థికంగా నిలదొక్కుకునే శక్తి కలిగేలా అండగా  ఉంటాం.ఎవరు కష్టపడుతున్నా వారిని అనునిత్యం ఆదుకుంటాం        క్షేత్రస్థాయిలో ఉంటున్న అంగన్వాడీ టీచర్లు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సాధించిన విజయాలను పిల్లల తల్లిదండ్రులకు, గ్రామీణులకు తెలిపి చైతన్యం తీసుకురావాలి. దేశంలో ఏరాష్ట్రం చేయని విధంగా సంపదను 10.5 శాతం అధికం చేశాం.జాతీయంగా వ్యవసాయ రంగంలో 2.5  శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 11శాతం ఉండటాన్ని గమనించాలి. స్విస్ బ్యాంక్ నుంచి నల్లడబ్బు తెచ్చి ప్రతి పౌరుడికీ రూ. పదిహేను లక్షలు ఇస్తామని ఎన్నికల హామీని ప్రధాని మోడీ నెరవేర్చలేకపోయారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇరవై వేలకుపైగా విద్యావాలంటీర్లను ఉపాధిని దెబ్బతీసింది.కేంద్రం మాటాలు చెప్పినంత మేరకు చేతలలో చూపించలేకపోతోంది. కేంద్రానికి ఎన్నికల హామీలు అమలు చేయడం కష్టంగా మారింది.  రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి పెంచడం  మూలంగా భవిషత్తులో విద్యుత్ ధరలు తగ్గించే స్థితికి వచ్చాం.వినూత్న ఆలోచనలతోఅభివృద్ధి ఫలాలను రాష్ట్రప్రజలకు అందిస్తున్నాం.  తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధిని, ఉత్తమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సమాజంలో మహిళలకు గౌరవం ఇస్తున్నాం.డ్వాక్రా, అంగమ్వాడీ మహిళలకు అండగా నిలబడ్డాం.గ్రామాల్లో ప్రభుత్వ పాలనపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు.

Related Posts