కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరగా, ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు వెల్లడించారు. ఈ ఉదయం సీఎం రమేష్, ఆయనతో పాటు దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ బీటెక్ రవిలను పరీక్షించి కడప రిమ్స్ వైద్య బృందం, వారు చాలా నీరసంగా ఉన్నారని, షుగర్ లెవల్స్ తగ్గాయని, బీపీ కూడా తగ్గుతోందని తెలిపారు.