ముంబయికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై ప్లాస్టిక్ వేశాడని బాలీవుడ్ నటి అనుష్క శర్మ అతన్ని వారిస్తున్న సమయంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచిన విషయం తెలిసిందే. విరాట్ ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే అది వైరల్ అయింది.ఈ నేపథ్యంలో విరుష్క దంపతులకు అర్హాన్ సింగ్ శనివారం లీగల్ నోటీసులు పంపారు. తనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా తానెంతో మనోవేదనకు గురయ్యానని.. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరిగినందుకు తాను ఎంతో బాధ పడ్డానని..దీనికి ప్రతిగా విరుష్క దంపతులు తనకు క్షమాపణలు చెప్పాలని’ లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు.