నటి రేణూ దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఉంగరాలు మార్చుకున్న ఫొటోను పంచుకున్నారు. ‘నిశ్చితార్థం జరిగింది’ అని పోస్ట్ చేశారు. తనకు కాబోయే భర్తకు ధన్యవాదాలు చెప్పారు. ‘బాధ నుంచి కోలుకునేందుకు నాకు సహాయంగా నిలిచినందుకు నీ నిజాయతీ మనసుకు ధన్యవాదాలు’ అని రాశారు.