YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జూలై మొదటి వారంలో అగ్రి బాధితులకు పేమెంట్స్

జూలై మొదటి వారంలో అగ్రి బాధితులకు  పేమెంట్స్
చెప్పినట్టుగానే అగ్రిగోల్డ్‌ భాదితులకి న్యాయం చేస్తున్నారు చంద్రబాబు. జనాల నెత్తిన టోపీ పెట్టి మూసేసిన చిట్ ఫండ్ కంపనీ నుంచి, ఆస్తులు రికవర్ చేసి, వేలం వేసి, డబ్బులు రికవరీ చేసి, బాధితులకి తిరిగి డబ్బులు ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. విశాఖపట్నంలో, విఆర్‌ చిట్స్‌ బాధితులను ఆదుకున్న తరువాత నుంచి, అగ్రి గోల్డ్ బాధితులు కూడా, కొండ అంత అండతో, చంద్రబాబు మమ్మల్ని ఆదుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే అనేక కారణాలతో, విషయం కోర్ట్ లో ఉండటంతో, లేట్ అవుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు వీరి బాధలు తీరనున్నాయి. తొలి విడతగా జూలై ఒకటో తేదీన కృష్ణా జిల్లా పరిధిలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల విక్రయానికి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.కొన్నిరోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్‌ ఆస్తుల విక్రయంపై ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేశారు. రెండు వారాల్లోగా స్పష్టమైన పురోగతి, ఫలితం ఉండాల్సిందేనని అధికారులకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తుల విక్రయ ప్రక్రియకు కృష్ణాజిల్లా నుంచి శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ జిల్లాలోని ఐదు ఆస్తుల వేలానికి వచ్చేనెల ఒకటో తేదీన టెండర్లు పిలుస్తారు. జూలై 8న టెండరుదారులకు ఆ ఆస్తులను చూపిస్తారు. టెండర్ల గడువును 15వ తేదీగా ఖరారు చేయాలనే ఉద్దేశంతో అధికారులు గడువు ముగియగానే 16వ తేదీన టెండర్లను తెరుస్తారు. అత్యధిక ధరకు కోట్‌ చేసినవారికి ఆ ఆస్తులను విక్రయిస్తారు. ఈ వేలం ప్రక్రియ మొత్తాన్ని ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిస్తారు. ప్రభుత్వం, హైకోర్టు ఆశించిన స్థాయిలో ధర వస్తేనే విక్రయించాలన్న ఉద్దేశంతో అధికారులు ఉన్నారు.ప్రతి ఆస్తి రిజిస్ర్టేషన్‌ విలువ ఎంత, వాల్యూయర్‌ నిర్ణయించిన ధర ఎంత, అక్కడ రియల్టీ ప్రకారం ధర ఎంత అనే వివరాలను ప్రభుత్వం రూపొందించింది. మార్కెట్‌ ధర ప్రకారం టెండర్లు కోట్‌ అయితేనే ఆస్తుల విక్రయం చేస్తారు. తక్కువకు కోట్‌ చేయడం, రింగవడం వంటివి జరగకుండా ముందుగానే వాటి విలువలను సుమారుగా నిర్ణయించారు. వాటికంటే ఎక్కువగా కోట్‌ చేసిన టెండరుదారుకు ఆస్తులను అప్పగిస్తారు. అంతా కోర్ట్ పర్యవేక్షణలో జరుగుతుంది. దీంతో, ప్రతిపక్షాలకు గొడవ చేసే ఆస్కారం కూడా ఉండదు. విజయవాడలో మూడు స్థలాలు, మచిలీపట్నంలో వాణిజ్యస్థలం, వీర్లపాడు మండలంలో భూమి, తొలి విడతగా వేలం వేసి, ఆగ్రిగోల్డ్ బాధితులకు ఆ డబ్బు ఇవ్వనున్నారు.

Related Posts