కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో పవన్ సాధినేని దర్శకుడిగా ఒక మల్టీ స్టార్రర్ తెరకెక్కుతుంది.ఒక కథానాయకుడిగా చేయనున్న కల్యాణ్ రామ్ .. మరో హీరోగా నాగార్జున అయితే బాగుంటుందని భావించాడట. ఆ వెంటనే నాగ్ కి కథ చెప్పడం .. ఆయన ఓకే అనడం జరిగిపోయాయట. ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ .. ఆ కొత్తదనం కారణంగానే ఆయన కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున .. నానితో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.