YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు బీసీలంటే చిన్నచూపు : వైకాపా

చంద్రబాబుకు బీసీలంటే చిన్నచూపు : వైకాపా
ఉత్తరాంధ్ర లోని మూడు జిల్లాలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఉపాధి లేక తమిళనాడు, కర్ణాటక లకు వలస వెళుతున్నారని వైకాపా ఎంపీ  విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం నాడు అయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. వంశధార  ప్రాజెక్ట్ 2018 లో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పినా పనులు పూర్తి చేయలేదు. ప్రాజెక్ట్ లో అవినీతి జరుగుతుంది. మెట్ట ప్రాంతాలకు సాగునీరందించే  ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను చంద్రబాబు పెట్టించుకోలేదని అయన విమర్శించారు. సొంత లాభం కోసం చంద్రబాబు, లోకేష్ లు ప్రయత్నిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో సుమారు 3 నుండి 4 లక్షల కోట్లు చంద్రబాబు దోచుకొని విదేశాలకు తరలించినా ఇంకా సంతృప్తి చెందడం లేదని అన్నారు. బీసీ లు న్యాయమూర్తులుగా పనికిరారని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసారు. మత్సకారుల, నాయీ బ్రామ్మ ణులు సమస్యలు చెప్పుకోవడానికి వెళితే చంద్రబాబు బెదిరించారు. బీసీ లంటే చంద్రబాబు కు చిన్న చూపని అయన అన్నారు. జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడోస్తాయని ఎదురుచూస్తున్నాం. ఎన్నికలలో గెలుపుకోసం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తున్నామన అన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి సంసిద్దంగా ఉన్నామని అయన అన్నారు. వైసీపీ పార్టీ జెండాతో గెలిచిన 23 మంది  ఎమ్మెల్యేలను  చంద్రబాబు  బజారులో పశువులను  కొన్నా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. వైసీపీ కి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.  ఎవరు తప్పు చేసినా మేము చెబుతాం. చంద్రబాబు లాగా రోజుకొక మాట చెప్పమని అన్నారు. చంద్రబాబు రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించినా   కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో  అసెంబ్లీ కి వెళ్లకుండా వైసీపీ ఎమ్మెల్యేలు బోయికాట్ చేసారు. వైసీపీ ఎంపీ లు రాజీనామాలు చేసిన చోట ఉపఎన్నికలు వచ్చిన మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అయన వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేశారని అన్నారు.

Related Posts