YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావుపై అట్రాసిటీ కేసు నమోదు

వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావుపై అట్రాసిటీ కేసు నమోదు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సీతారామపురంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బాబుజగ్జీవన్‌రావు విగ్రహానికి పూలమాలలు వేసే విషయంపై ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ సందర్బంగా కృష్ణా జిల్లా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, బాపులపాడు మండలం ఏ.సీతారామపురంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి దండ వేయకుండా వెళ్లారనే అంశానికి సంబంధించి టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విగ్రహానికి ముందుగా వైకాపా నేతలు పూలమాల వేయడంతో తెదేపా నేతలు పాలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి నిర్వహించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో తమను కర్రలతో వెంటబడి కొట్టారని... కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ నూజివీడు పోలీసులకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఘటనలో రాళ్లదెబ్బలు తిన్న టీడీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, టీడీపీ వర్గీయులే తమపై తొలుత దాడికి యత్నించారంటూ వైసీపీ వర్గీయులు ఫిర్యాదు చేయగా... టీడీపీ వర్గీయులపై కూడా కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

Related Posts