విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై నెట్‌జన్లు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. లక్నోకు చెందిన ఓ జంటకు పాస్‌పోర్ట్‌ను జారీ చేసిన కేసులో ఆమెపై ట్విట్టర్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుష్మా వ్యవహార శైలిని వాళ్లు తప్పుపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమెను మెచ్చుకుంటున్నారు. అయితే తన ట్విట్టర్ అకౌంట్‌కు వచ్చిన ట్వీట్లను సుష్మా షేర్ చేశారు. నిజానికి గత వారం రోజులుగా తాను ఇండియాలో లేను అని, ఆ సమయంలో తనకు అనేక ట్వీట్లు వచ్చాయని, అందులో కొన్నింటిని మీముందు ఉంచుతున్నట్లు ఆమె తెలిపారు. తనను ద్వేషిస్తూ రాసిన ట్వీట్లను కూడా ఆమె రీట్వీట్ చేయడం విశేషం. సుస్మా.. ఓ వీసామాత అని, ఆమెకు ఏమీ తెలియదని, ఆమెను వెంటనే తొలిగించాలని కొందరు డిమాండ్ చేశారు. మతాంతర వివాహం చేసుకున్న జంటకు వీసా జారీ చేసేందుకు లక్నో అధికారి వికాస్ మిశ్రా నిరాకరించారు. ఆ విషయాన్ని ఆ జంట ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. విదేశాంగ శాఖ దానిపై స్పందించింది. ఆ జంటకు వీసా ఇవ్వడమే కాకుండా, సదురు అధికారిని తొలిగించారు. అయితే ఎటువంటి విచారణ జరపకుండానే అధికారిని ఎలా తొలిగిస్తారని కొందరు ప్రశ్నించారు. కొందరు సుష్మాను పాస్‌పోర్ట్ మాతా అంటూ కూడా నిందించారు. ఇండియాలో సుష్మా లేనప్పుడు ఈ ఘటన జరిగినా, ఆమెకు మాత్రం ఆన్‌లైన్ వేధింపులు తప్పలేదువిదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురవుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఓ హిందు-ముస్లిం జంటకు పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన ఉదంతంలో సుష్మాకు విపక్ష పార్టీ మద్దతు పలికింది. లక్నో (ఉత్తరప్రదేశ్)కు చెందిన ఓ హిందు-ముస్లిం జంటకు పాస్‌పోర్ట్ జారీకి నిరాకరించి వికాస్ మిశ్రా అనే అధికారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు అతణ్ని బదిలీ చేసి, సదరు జంటకు పాస్‌పోర్టు జారీ చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సుష్మాపై కొంత మంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. లక్నోకు చెందిన మహ్మద్ అనాస్ సిద్ధిఖీ, తన్వీ సేథ్ దంపతులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోగా వికాస్ మిశ్రా అనే అధికారి అనాస్‌ను పేరు మార్చుకోవాల్సిందిగా సూచించారు. దీనిపై బాధితులు సుష్మాకు ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే స్పందించి పాస్‌పోర్టు మంజూరు చేయించారు. అంతేకాకుండా వికాస్‌ను బదిలీ చేశారు. ఈ చర్యను కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది మీకు అమర్చిన ఇస్లామిక్ కిడ్నీ ప్రభావం కావొచ్చు’ అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శించారు. ‘ఒకే ఒక కిడ్నీపై జీవిస్తున్న సుష్మా.. మరణించిన వ్యక్తితో సమానం’ అంటూ మరో వ్యక్తి దూషించాడు. గతేడాది సుష్మాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. ఒక ముస్లిం వ్యక్తి నుంచి సేకరించిన కిడ్నీని ఆమెకు అమర్చారు..