సంక్రాంతి సెలవుల దృష్ట్యా 132 ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేస్తున్నట్లు సికింద్రాబాద్ సీపీఆర్వో తెలిపారు. రద్దీకి అనుగుణంగా టికెట్ కౌంటర్లు పెంచామని చెప్పారు. సికింద్రాబాద్, తిరుపతి, కాచిగూడ నుంచి ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. 11, 12, 13 తేదీల్లో రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్స్ పూర్తయ్యాయని సీపీఆర్వో తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ మేరకు అదనపు రైళ్లతో పాటుగా రద్దేని బట్టి సాధారణ రైళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.