YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హిట్లర్‌తో పోల్చిన అరుణ్ ‌జైట్లీ

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హిట్లర్‌తో పోల్చిన అరుణ్ ‌జైట్లీ
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చారు. కేంద్ర మంత్రి అరుణ్ ‌జైట్లీ. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలకు దిగారు. 1975 జూన్‌ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన తేది ని గుర్తు చేస్తూ నేడు జైట్లీ ఇందిరను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఆమెను జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చారు. ఇందిర, హిట్లర్‌ ఇద్దరూ రాజ్యాంగాన్ని రద్దు చేసిన వారేనని అన్నారు. వారు ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చుకునేందుకే రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారని జైట్లీ వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అరెస్ట్‌ చేయించి హిట్లర్‌ తన మైనార్జీ ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తెచ్చుకున్నారని అన్నారు. అయితే హిట్లర్‌లా కాకుండా ఇందిరాగాంధీ భారత్‌ను వంశపారంపర్య ప్రజాస్వామ్యంగా మార్చారని జైట్లీ తన పోస్టులో రాసుకొచ్చారు.ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా వేధించిందని జైట్లీ ఆరోపించారు. ప్రాథమిక హక్కులను కాలరాసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆ సమయంలో ప్రజలు భయాందోళనలతో గడిపారని తెలిపారు. మీడియాపైనా ఆంక్షలు విధించారని, పలువురు ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టారని జైట్లీ గుర్తుచేశారు. రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 1975 జూన్ 26వ తేదీన ఆందోళన చేపట్టినందుకు తాను కూడా జైలుకు వెళ్లానని చెప్పారు. వివిధ పార్టీల కార్యకర్తలను, ప్రతిపక్ష నేతలను, ఆరెస్సెస్‌ కార్యకర్తలను జైలుకు పంపించారని జైట్లీ వెల్లడించారు. 1975 జూన్‌ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.

Related Posts