YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రారంభమైన శానిటరీ స్పెషల్ డ్రైవ్

ప్రారంభమైన శానిటరీ స్పెషల్ డ్రైవ్
వర్షాకాలం ప్రారంభమవడంతో జిల్లా వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జిల్లాను ఆరోగ్యకరమైన జిల్లాగా ఉంచాలనే ఉద్దేశంలో  సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా శానిటేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహింస్తున్నారు. ముఖ్యంగా దోమలు ఎక్కువ స్థాయిలో విజృంభించే అవకాశం ఉందని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి వ్యాధులకుల గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంటి ఆవరణలో వర్షపు నీరుగానీ, ఇతరత్రా నీరు గానీ నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీరు నిల్వ ఉంంటే దోమలు వచ్చే అవకాశం ఉందని సాధ్యమైనంత వరకు ఇంటిలోనూ, పరిసర ప్రాంతాలలోని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వర్షాకాలం కారణంగా వచ్చే వివిధ వ్యాధులకు సంబంధించి పూర్తిస్థాయిలో మందులు, ఇంజక్షన్లు అందించేందుకుగానూ జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మందులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. మరో వైపు రిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, దాని వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌, కమిషనర్‌ జె.నివాస్‌లు ఇండోర్‌ నగరంలో ఆదివారం పర్యటించి పరిశీలించారు. చెత్తను తరలించు ప్రక్రియకు వినియోగిస్తున్న ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌, బయోమిథనైజేషన్‌ ప్లాంట్‌, డ్రమ్‌ కంపోస్టింగ్‌ యూనిట్‌, ఇంటిగ్రేటెడ్‌ కంపోస్టింగ్‌ యూనిట్‌లను స్వయంగా మేయర్‌, కమిషనర్‌ పరిశీలించారు. ప్లాట్‌ల పని తీరు, అమలు పరుస్తున్న విధానం తదితర అంశాలను ఇండోర్‌ నగరపాలక సంస్థ అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. సాల్డిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద నిత్యం ఇంటింటి చెత్త సేకరణ ద్వారా వచ్చే చెత్తను తరలించడానికి ఎనిమిది ప్రాంతాల్లో హైటెక్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి స్టేషన్‌లో కాంప్యాక్టర్‌, హుక్‌లోడర్‌, బకెట్‌లను వినియోగించు చెత్తను రెడ్యూస్‌ చేయడం జరుగుతుందని మేయర్‌, కమిషనర్‌లకు అక్కడి అధికారులు వివరించారు

Related Posts