విదేశీ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలు దాదాపు 400 వర కు ఉంటాయని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల విచారణలో వెలుగు చూసిన అంశాలతో అంచనా వేస్తున్నారు. గుజరాత్ సూరత్‌తో పా టు ముంబై తదితర ప్రాంతాల్లో ఈ ముఠాలు ఆన్‌లైన్ విదేశీ మార్కెట్ ట్రేడింగ్‌తో పాటు దేశీయ ట్రేడింగ్‌ల లాభాల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఫోన్లలో మాట్లాడుతూ, మెసేజ్‌లు పంపిస్తూ భారీ లాభాలంటూ బురి డీ కొట్టిస్తున్న ఈ ముఠాలు దేశ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ఖాతాదారుల నుంచి కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేస్తున్నారు. ఇది తెలియని చాలా మంది అమాయకులు లాభాలు అనగానే గుడ్డిగా నమ్మి లక్షలాది రూపాయలను వారి చేతుల్లో పెడుతున్నారు. ఇలాంటి ముఠాలు సూరత్‌లో ఎక్కువగా ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక అప్లికేషన్ ద్వారా మన పేరు మీద ట్రేడింగ్‌కు సంబంధించిన పేజీ సృష్టించి అందులో లాభాలను డాలర్ల రూపంలో చూపుతూ అమాయకులను నమ్మిస్తున్నారు. ఇలా లక్షలు వసూలు చేసి.. అనంతరం బాధితులు డబ్బులు అడుగగానే ఆ పేజీలను డిలీట్ చేయడంతో పాటు ఫోన్లను ఎత్త డం లేదు. అప్పుడు మోసపోయామని గ్రహించి చాలా మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 120 మందిని మోసం చేసిన లఖానీ ముఠాను ఏ ఒక్క రాష్ట్ర పోలీసులు కూడా గుర్తించలేకపోయారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు అందుకున్న 15 రోజుల్లో ఈ ముఠా గుట్టును బయటపెట్టి మరోసారి తెలంగాణ పోలీసు బ్రాండ్‌ను దేశానికి చాటి చెప్పారు. ఈ ముఠా మిస్టరీ ఛేదించేందుకు సమర్థవంతంగా పని చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీలు చంద్రకాంత్, సీహెచ్‌వై శ్రీనివాస్ కుమార్, ఇన్‌స్పెక్టర్ లు శ్రీనివాస్, నవీన్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్, కానిస్టేబు ళ్లు నందుయాదవ్, భరత్‌కుమార్‌లను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు చిక్కిన లఖానీ ముఠా ను విచారించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. ఈ ముఠా ప్రతి రోజు 40 వేల మందికి ఆన్‌లైన్ విదేశీ ట్రేడింగ్ లావాదేవీల్లో భారీగా లాభాలంటూ ఫోన్ లు చేయడంతో పాటు మెసేజ్‌లను పంపిస్తారు. వీటికి తిరి గి స్పందించిన వారిలో 10 మందిని టార్గెట్ చేసుకుని.. ఐదుగురిని ట్రాప్ చేస్తారు. ఇలా ఈ ముఠా 2014 నుంచి మోసాలకు పాల్పడుతున్నది. లఖానీ జాతీయ స్టాక్ ఎక్సేంజ్, ముంబై స్టాక్ ఎక్సేంజ్ ఖాతాదారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను డాటాబేస్ ఇండియా వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేస్తుంది. మూడు నెలల ముందు ఖాతాదారుడి ఫోన్ నెంబర్ కోసం ఒక రుపాయి, తాజా ఖాతాదారుడి నెంబర్ కోసం మూడు రూపాయలను చెల్లించి లక్షలాది ఖా తాదారుల డేటాను కొనుగోలు చేస్తుం ది. లఖానీ మేటాట్రేడర్ 4 సర్వర్‌ను స్నేహితుడి నుంచి కొనుగోలు చేసి ట్రేడ్ మోనోఎఫ్ ఎక్స్ డాట్ కాం పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించి.. దానికి సపోర్ట్ ఎట్ ట్రేడ్ మోనోఎఫ్ ఎక్స్ డాట్ కాం ఈ మెయిల్ ఐడీని తయారు చేశాడు. ఇలా నగదు డిపాజిట్ చేసే అ మాయకులకు అతను తయారు చేసిన మేటాట్రేడర్ 4 సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ద్వారా ఓ పేజీని ఇస్తాడు. దీంతో అం దులో అతను పొందుపర్చే లాభాల చిట్టాను నిజమేనని భావించి అందరూ బోల్తా పడుతూ లక్షల రూపాయలు అతనికి ఇస్తున్నారు. ఈ ఖాతా తెరవడానికి లఖానీ బాధితుల నుంచి పాన్‌కార్డు, ఆధార్ కార్డులను తీసుకుంటాడు. సూరత్‌లో ఉద్యోగం మానేసి ముంబైకి తన మకాన్ని మార్చాడు. బీఎస్సీ చదివిన అలోక్‌పవార్, డిగ్రీ చదివిన నవాజ్ అన్సారీ, 9వ తరగతి చదివిన నిఖిత్ షెట్టీని కలుపుకుని ఆన్‌లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. దాదాపు 15 మంది టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు అమాయకులకు భారీ లాభాలంటూ ఎర ఏస్తూ వారిని నిండా ముంచుతున్నా డు. లఖానీ ముఠా సూరత్‌కు చెందిన ఫారూక్ అబుమాకర్ అగది, మక్సూద్ అగది, హూస్సేన్‌ల నుంచి ఈ ఆన్‌లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ ఛీటింగ్ దందా కోసం వెబ్‌సైట్‌లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మరో వైపు ట్రేడింగ్‌లో లా భాల కోసం సలహాలు ఇస్తానని కూడా లఖానీ గ్యాంగ్ చా లా మందికి టోపీ పెట్టింది. ఈ సలహాలకు కూడా వేలాది రూపాయలను వసూలు చేసి వారిని ముంచేశారని పోలీ సు దర్యాప్తులో తేలింది. మోసం తో వచ్చిన డబ్బుతో జ ల్సా చేసిన లఖానీ ముఠా సూరత్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ని ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.