YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇకపై ఐఫోన్లో కూడా ‘ఎంఆధార్’ యాప్‌‌‌..

ఇకపై ఐఫోన్లో  కూడా  ‘ఎంఆధార్’ యాప్‌‌‌..

- ఎంఆధార్ యాప్ ఉంటే.. ఆధార్ కార్డు వెంట అవసరం లేదు.. సీఈఓ,యుఐడీఏఐ 

-ప్రభుత్వ పథకాల నుంచి ప్రతిదానికి ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ప్రతిఒక్కరూ ఎక్కడికి వెళ్లినా తమవెంట ఆధార్ గుర్తింపుకార్డును తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గత ఏడాది జులైలోనే ‘ఎంఆధార్’ యాప్‌‌‌ను యూఐడీఏఐ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ యాప్‌ ఇప్పటివరకూ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే యూఐడీఏఐ సదుపాయం కల్పించింది. ఇకపై ఐఫోన్లు (ఐఓఎస్) వెర్షన్ యూజర్లకు కోసం త్వరలో ‘ఎంఆధార్’ యాప్ అందుబాటులోకి తేనున్నట్టు యూఐడీఏఐ ప్రకటించింది. ఈ మేరకు యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎంఆధార్ యాప్ ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రాగానే అప్పటినుంచి వారంతా తమవెంట ఆధార్ కార్డును తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
అయితే ఈ యాప్ ఎప్పుడు ప్రవేశపెడతారనే విషయంలో మాత్రం కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఈ ఎంఆధార్ యాప్‌ను వినియోగించాలంటే ఐఓఎస్ యూజర్లు ముందుగా యూఐడీఏఐతో తమ ఫోన్ నెంబర్‌ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెస్ పూర్తిన తరువాత యాప్ నుంచి తమ ఆధార్ కార్డు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ అయిన ఆధార్‌లో పేరు, పుట్టినతేదీ, జండర్, చిరునామా, ఫొటోగ్రాఫ్ డిజిటల్ రూపంలో యూజర్ల ఫోన్‌లో నిక్షిప్తమవుతాయి. ఇదిలా ఉండగా, ఈఆధార్/ఎంఆధార్‌ కూడా అన్నిచోట్ల చెల్లుబాటు అవుతాయని, తప్పనిసరిగా వాటిని అనుమతించాల్సిందిగా అన్ని ఏజెన్సీలకు యూఐడీఏఐ సూచించింది. భారత్‌లో రైలు ప్రయాణాల్లో కూడా ఎంఆధార్‌ను గుర్తింపు కార్డుగా వినియోగించుకునేలా ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

Related Posts