- భవిష్యత్తులో ల్యాబ్ ఆన్ చిప్
రోగనిర్ధారణకు చేసే పరీక్షలకు ఇప్పుడంటే పెద్ద పెద్ద యంత్రాలు అవసరం కానీ భవిష్యత్తులో ఈ ఇబ్బందులేవీ ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో ఓ నాణెం పరిమాణంలో ఉండే బుల్లి ల్యాబ్‌లు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. ల్యాబ్ ఆన్ చిప్‌గా వ్యవహరించే ఈ చిన్ని పరిశోధనశాలలో రోగ నిర్ధారణ చాలా సులువుగా మారనుందన్నారు. ఇప్పటికే ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయని త్వరలో ఈ బుల్లి ల్యాబ్ సాకారం కానుందని వివరించారు. అయితే, ఈ పరిశోధనలో నమూనాలను బుల్లి ట్యూబుల ద్వారా లోపలికి పంపడమే కష్టమైన పని అని, నిన్నమొన్నటి వరకూ దీనికి పరిష్కారం వెతికేందుకే శ్రమించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా ఈ సమస్యకు మెరుగైన పరిష్కారాన్ని కనుగొన్నామని యూనివర్సిటీ ఆఫ్ బఫెలో పరిశోధకులు తెలిపారు. దీంతో ల్యాబ్ ఆన్ చిప్ తయారీకి ఇంకెన్నో రోజులు ఆగాల్సిన అవసరం ఉండదని వివరించారు.