YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనార్ధనరెడ్డి కోసమే నాటకాలా..

జనార్ధనరెడ్డి కోసమే నాటకాలా..
గాలి జనార్దన్ రెడ్డి మెకాన్ సంస్థ కడపలో ఉక్కు అనుకూలం అని నివేదిక ఇచ్చిందని చెబుతున్నారని,బీజేపీ, వైసీపీ లు కలిసి గాలి జనార్దన్ రెడ్డి కోసం ఈ నాటకాలు ఆడుతున్నాయని మంత్రి అమరనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్ సంస్థలు అక్కడ పరిశ్రమ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, విభజన హామీల్లో ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి అని ఉంది జనార్దన్ రెడ్డి చెప్పడం సంతోషమేనని, ఎవరు వచ్చిన ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. గాలికి ఇచ్చింది ప్రభుత్వ ఆస్తి అని,విభజన హామీల్లో ప్రభుత్వం ప్లాంట్ పెడతామని చెప్పిందన్నారు. జగన్, బీజేపీలు జనార్డన్ రెడ్డికి లబ్ది చేకూర్చడం కోసమే ఇలా చేస్తున్నాయన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి కోసమే బీజేపీ-వైసీపీలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అడ్డు పడుతున్నాయని మంత్రి అమర్ నాధ్ రెడ్డి ఆరోపించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని మెకాన్ సంస్థ గతంలో నివేదిక ఇచ్చిందని, అవసరమైతే తానే ప్లాంటు పెడతానని గాలి జనార్ధన్ ప్రకటిండచం వెనుక కుట్ర ఉందన్నారు. జిందాల్, టాటా వంటి సంస్థలు కూడా అక్కడ ప్లాంట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, విభజన హామీల మేరకు ప్రభుత్వం రంగంలోనే అక్కడ ప్లాంటు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. బ్రాహ్మణి సంస్థ ప్లాంటు ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. బీజేపీ నాయకుడైన గాలి జనార్ధన్ రెడ్డి ప్లాంటు ఏర్పాటు చేస్తానని చెప్పడం వెనుక మోదీ రాష్ట్రానికి ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేయడం బయటపడిందని ఆరోపించారు. గాలికి లబ్ది చేకూర్చేందుకు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారన్నారుబ్రాహ్మణి విషయంలో సాధ్యాసాధ్యాలు చూడాలన్నారు. జిందాల్, టాటా కూడా ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కడపకు ఉన్నాయని,ముడి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి అమర్ నాధ్ రెడ్డి ఆరోపించారు.గాలి జనార్థన్ రెడ్డి బీజేపీ నాయకుడని, మోడీ రాష్ట్రానికి ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నారు అనడానికి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.  రాయలసీమ డిక్లరేషన్ గురించి ఎలా మాట్లాడతారని, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కని పోరాడారని, ఆమరణ దీక్ష చేస్తుంటే కేంద్రం నుంచి స్పందన లేదన్నారు మంత్రి అమర్ నాధ్ రెడ్డి. ప్రజలంతా స్వచ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్నారన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కోసమే కడపలో స్టీల్ ప్లాంట్ ఇవ్వడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆయన అమ్ముకోడానికి, ప్లాంట్ పెట్టడం కోసమే ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని అమర్ నాద్ రెడ్డి విమర్శించారు.

Related Posts