కమెడియెన్ గా కొనసాగుతూనే హీరోగా కూడా అడపా దడపా సినిమాలు చేస్తుంటాడు శ్రీనివాసరెడ్డి. మాస్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా తనకు నప్పే కథలు ఎన్నుకుంటాడు ఈ కమెడియన్ కమ్ హీరో. తాజాగా ఎవర్ గ్రీన్ చిత్రం జంబలకిడి పంబ టైటిల్ తీసుకోని సోల్స్ చ్చేంజింగ్ కాన్సెప్ట్ తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
క్లాసిక్స్ గా నిలిచిపోయిన సినిమాల పేర్లు పెట్టుకుని సినిమాలు తీయడం పెద్ద సాహసమే చెప్పుకోవాలి. జంబలకిడి పంబ అనే టైటిల్ తీసుకోవడంతోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ కూడా సినిమాపై మంచి హైప్‌ని పెంచేశాయి. శ్రీనివాసరెడ్డికి జోడీగా సిద్ధీ ఇద్నానీ నటించింది. రైట్ రైట్ దర్శకుడు మనో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. టైటిల్ కి ఏ మాత్రం అన్యాయం చేయమని శ్రీనివాసరెడ్డి చెప్పినా సినిమా పూర్తిగా న్యాయం చేయలేదని సినిమా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నాడు.స్రీ పురుషుడిగా, పురుషుడు స్రీ గా మారే చిన్న అంశం తప్ప ఎక్కడా జంబలకిడి పంబతో పోలిక లేదన్నది క్రిటిక్స్ మాట. పేలవమైన కథాంశంతో పాటు సీన్ల అల్లికలో దర్శకుడు పూర్తిగా విపలమయ్యాడని వారి వాదన. శ్రీనివాసరెడ్డి కామెడీ టైమింగ్ తో తన వంతు ప్రయత్నం చేసినా , హిరోయిన్ సిద్ధీ ఇద్నానీ సూపర్ పర్పామెన్స్ చేసినా సినిమా యావరూజ్ గా ఉందన్నది కొందరి ప్రేక్షకుల అభిప్రాయం. పోసాని, వెన్నెల కిషోర్ అక్కడక్కడ పంచ్ లతో ఆకట్టుకున్న సినిమాకి మాత్రం హిట్ టాక్ తేలేకపోయారుఇప్పటి వరకు విభిన్న స్రిప్ట్స్ తో హీరోగా మంచి విజయాలను అందుకున్న శ్రీనివాసరెడ్డి పూర్తి లవర్ బాయ్ సీన్లలో ఇమడలేకపోయాడన్నది కొందరి ప్రేక్షకుల వాదన. ముఖ్యంగా క్లాసిక్ టైటిల్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేదని, తదుపరి కథల విషయంలో శ్రీనివాసరెడ్డి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని సినీ జనం అభిప్రాయపడుతున్నారు.