విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ కి ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లోకి కలపడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. భద్రాచలం ముంపు మండలాలు ఆంద్రప్రదేశ్ లో కలపక పోతే అన్యాయం జరిగేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.ప్రధాని మోడీ ఆర్డినెన్స్ ద్వారా ముంపు మండలాలను కలపకపోతే పోలవరం ఒక కలగా మిగిలిపోయేది. స్పెషల్ కేస్ కింద పోలవరం ప్రాజెక్టు ను కేంద్రమే కట్టాల్సి ఉంది. యన్ డి ఏ లో తెలుగుదేశం భాగస్వామ్యం కావడంతో సిఎం చంద్రబాబు కోరిక మేరకే పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టు పనులు అప్పగించిందని అయన అన్నారు. ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ గానే బాధ్యత వహిస్తోంది. కాంట్రాక్టర్ ఎస్టిమేషన్స్ పెంచుకునే అధికారం దేశంలో ఎక్కడా లేదు. కేంద్రం ఇచ్చే నిధులతోనే ప్రాజెక్టు కడుతున్నారు.ప్రభుత్వ ఖర్చుతో పోలవరం ప్రాజెక్టు కు రైతులను తీసుకు వెళ్తున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాలను ఇష్టారాజ్యంగా పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కు ఎక్కడిదని అయన ప్రశ్నించారు. ప్రాజెక్టు కు కేంద్రం ఒక్క రూపాయి కూడా బకాయి లేదు. పోలవరం ప్రాజెక్టు ను రాజకీయం చేయవద్దు. కడపలో స్టీల్ ప్లాంట్,దుగరాజపట్నంలో పోర్ట్ రావాలని ప్రభుత్వం కు లేదు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు సయిందవుడిలా వ్యవహరిస్తున్నారు