పవన్ మాజీ భార్య రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కూడా ట్విట్టర్ లో తన మాజీ భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు. కానీ ఈ విషయం పవన్ అభిమానులకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. దీంతో రేణు ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దానిని ట్విటర్ ద్వారా ప్రకటించారు. `ట్విటర్ నిండా విపరీతమైన ప్రతికూల భావనలు నిండి ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ట్విటర్ నుంచి వైదొలిగి ఆ నెగిటివిటీకి దూరంగా ఉండదలచుకున్నాను. అదే సమయంలో నన్ను అర్థం చేసుకుని, నా మంచి కోరుతూ ప్రతికూల పరిస్థితుల్లో నాకు తోడుగా నా వెంట ఉన్న ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు` అని రేణు ఓ లేఖను పోస్ట్ చేశారు.