ఏపీ హక్కుల విషయంలో రాజీనే లేదంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో ఇవాళ టీడీపీ అధినేత అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరుపై భగ్గుమన్నారు. ‘కడప ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం రమేష్, బీటెక్ రవి గట్టిగా పోరాడుతున్నారు. బీటెక్ రవి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. కడప ఉక్కుకు మద్దతుగా ఆందోళనలు, బైక్ ర్యాలీలు ఉధృతం చేయాలి. బుధవారం సైకిల్ యాత్రలు.. గురువారం ధర్నాలు చేయాలి. ఈనెల 28న ఢిల్లీలో ఎంపీలు చేసే ధర్నాలకు మద్దతుగా.. రాష్ట్రంలోను ధర్నాలు చేపట్టాలి. ఈ నిరసన సెగ ఢిల్లీని తాకాలన్నారు’చంద్రబాబు.
టాప్ వ్యాఖ్యనీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని అడగాల్సినవి అన్నీ అడిగాం.. ఇకపై విభజన హామీలను కేంద్రం మెడలు వంచైనా సాధించుకుంటాం. ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో గాలి జనార్థన్ రెడ్డి అండ్ కో నాటకాలు ఆడుతున్నారు. బీజేపీ-వైసీపీలు ఒక్కటే అనేందుకు గాలి జనార్దన్ రెడ్డి మాటలే నిదర్శనం. వైసీపీ-బీజేపీ లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయి. అడ్డంగా దొరికిపోయి పొంతనలేని సమాధానాలు చెప్పారు. వారి దొంగాటను ప్రజలకు వివరించాలి. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సొంత మైక్‌లా.. బీజేపీకి అద్దె మైక్‌లా మాట్లాడుతున్నారన్నారు’ బాబు. దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో భేటీ అంశం కూడా సమన్వయ కమిటీలో చర్చకు వచ్చిందట. పవన్ కళ్యాణ్‌తో సమావేశంలో ఎలాంటి రాజకీయపరమైన అంశాలు చర్చకు రాలేదని.. హలో అంటే హలో అనుకున్నామని చంద్రబాబు అన్నారట. ఈ విషయంపై పార్టీ నేతలకు ఓ స్పష్టత ఉండాలనే క్లారిటీ ఇస్తున్నానని బాబు చెప్పారట. ఇక శ్రీవారి నగల ప్రదర్శన చేయడం మంచిదికాదని పూజారులు చెబుతున్నారని.. స్వామివారి ప్రతిష్ట దిగజార్చేలా రాజకీయాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారట.