రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది. పదవ పిఆర్సీ బకాయిల విడుదల కోసం జివో నెంబర్ 98 విడుదల అయింది. 10వ పిఆర్సీ పై గత నాలుగు సంవత్సరాల నుండి ఉద్యోగుల అందరం వేచి చూశాం. సియం చంద్రబాబు పిఆర్సీ బకాయిలు చెల్లింపు పై ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగుల సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిసారు. విశ్రాంత ఉద్యోగులకు మూడు దఫాలుగా బకాయిలు చెల్లింపు చేస్తారు. సీపీఎస్ S ఉద్యోగులకు 10% పెన్షన్ కంట్రిబ్యూషన్ మినహాయించి మిగిలిన 90% మొత్తము మూడు దఫాలుగా చెల్లిస్తారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఒక నెల జీతము నగదు గాను, మిగిలిన 9 నెలల బకాయిలు నవంబర్2018 లోగా ఏవిధమైన నిబంధనలు లేకుండా జీపీఎప్ ఖాతాలకు జమ చెస్తారు. దశలవారీగా అక్టోబర్, నవంబర్ నాటికి బకాయిల చెల్లింపు వుంటుంది.