అమరావతి: సింగపూర్ సోషల్ అండ్ ఫ్యామిలీ డెవలప్మెంట్ డేస్మాన్డ్ లీ,సింగపూర్ బృందం తో మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. గ్రామీణాభివృద్ధి లో టెక్నాలజి వినియోగం,ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలు ను లోకేష్ వారికి వివరించారు. అమరావతి, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు సింగపూర్ బృందానికి ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సింగపూర్లో ఇప్పుడు అమలు చేస్తున్న డ్రోన్ పెట్రోలింగ్ గురించి సింగపూర్ సోషల్ అండ్ ఫ్యామిలీ డెవలప్మెంట్ డేస్మాన్డ్ లీ వివరించారు.
దీంతో విశాఖ సముద్ర తీరం, బీచ్ ఏరియాలో ప్రమాదాల నివారణకు, నిఘాకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందనిఅయన అన్నారు. డ్రోన్ ద్వారా బీచ్ ప్రాంతంలో నిరంతరం నిఘా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. విశాఖలో ఈ టెక్నాలజీ అమలుకు సహకరించాలని డెస్మాన్డ్ లీని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై స్పందించిన డేస్మాన్డ్ లీ డ్రోన్ పెట్రోలింగ్లో సహకారం అందిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, టూరిజం అభివృద్ధిలో సింగాపూర్ సహకరించాలని మంత్రి కోరగా, ఈ రెండు రంగాల అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తామని డేస్మాన్డ్ లీ అన్నారు.