వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. ఈ పాదయాత్రను చేపట్టి ఇవాళ్టికి 200 రోజులు పూర్తయ్యింది.యాత్ర మొదటి రోజు నుంచి ప్రజల మొహాల్లో రేపటి ఆశను చూశాను. నా ప్రజా సంకల్పయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. నాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రజల మొహాల్లో చిరు నవ్వులు చూడటమే ఓ సంకల్పంగా భావిస్తున్నాను’అన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కూడా అధినేతకు శుభాకాంక్షలు తెలిపాయి. ప్రస్తుతం జగన్ యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవాళ యాత్ర 200 రోజుల మైలు రాయిని చేరుకోవడంతో జగన్ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో మమేకమవుతూ నడకను ప్రారంభించారు. అలాగే జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తమ శుభాకాంక్షలను తెలియజేశారు. బుధవారం నాటికి జగన్ 2వేల434.2 కిలోమీటర్లు నడిచారు.