YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇక డైరక్ట్ ఫైట్ గా నారా లోకేష్

 ఇక డైరక్ట్ ఫైట్ గా నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ లోకానికి భయపడిపోతున్నట్టున్నారు. విపక్షాలు, ప్రత్యర్థులు చేసే విమర్శలను ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకోసమే ఆయన సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. నారా లోకేష్ ఇక ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం విశేషం. నారా లోకేష్ ఇప్పటికే మంత్రి అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ గా ఎంపికైన తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి పదవి చేపట్టి ఏడాదిన్నర మాత్రమే అవుతుంది. అయినా శాఖలో పట్టుకోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కీలకమైన పంచాయతీరాజ్, ఐటీ వంటి శాఖలను సమర్థవంతంగా లోకేష్ డీల్ చేస్తున్నారన్న పేరును కొద్దికాలంలోనే సంపాదించుకున్నారు. ప్రతిపక్షాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. గత ఏడాదిన్నరకాలంగా ఆయన విపక్షాలు సూటిగా వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ. దమ్ముంటే ప్రత్యక్ష్యంగా ఎన్నికై శాసనసభకు వచ్చి మంత్రికావాలని వైసీపీ నేతలు సవాల్ విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే లోకేష్ తో పాటు అనేక మంది ఎమ్మెల్సీలు మంత్రలయ్యారు. ఇందులో నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారున్నా లోకేష్ మాత్రమే విపక్షాలకు టార్గెట్ గా మారారు. దీంతో ఆయన ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ఆ పార్టీ నేతల్లోనే చర్చనీయాంశంగా మారింది.నిజానికి లోకేష్ మంత్రి కావడానికి అప్పట్లోనే తాము రాజీనామా చేసి నియోజకవర్గాన్ని ఖాళీ చేస్తామని అనేకమంది నేతలు ముందుకు వచ్చారు. పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అయితే తాను లోకేష్ కోసం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇలా అనేకమంది నేతలు రాజీనామాలకు ముందుకు వచ్చినా లోకేష్ మాత్రం మండలికి వెళ్లేందుకే ఇష్టపడ్డారు. మండలిలో చర్చలు అర్థవంతంగా జరుగుతాయని, తాను విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని అప్పట్లో చెప్పారు.కాని ఇప్పుడు లోకేష్ ప్రకటనతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. లోకేష్ ఎక్కడ సీటు కోరుకున్నా కాదనే వారుండరు. ఆయనకు అడ్డుచెప్పే వారుండరు. కాని ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారా? అన్న ఆసక్తి ఇప్పటి నుంచే బయలుదేరింది. లోకేష్ కు రెండు ఆప్షన్లు ఉన్నాయని పార్టీలో గట్టిగా టాక్ విన్పిస్తోంది. కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గుడివాడ నుంచి పోటీ చేద్దామనుకున్నా అక్కడ బలమైన ప్రత్యర్థి కొడాలి నాని ఉన్నారు. కొడాలి నానిని ఓడించాలంటే తాను రంగంలోకి దిగాలంటున్నారట లోకేష్. అలాగే తన మావయ్య నందమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్నది సందేహమే. బాలయ్య పోటీ చేయకుంటే హిందూపురం నుంచి పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. మొత్తం మీద లోకేష్ వచ్చే ఎన్నికల బరిలో అభ్యర్థిగా ఉంటానని చెప్పి పార్టీలో పెద్ద చర్చే లేపారు.

Related Posts