- ఆల్ టైమ్ కెరీర్ అత్యధిక ప్లేయర్ ర్యాంకింగ్స్ ఫర్ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ
- 31 నుంచి 26వ స్థానానికి చేరుకున్న కోహ్లీ..
- ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్
టీమిండియా కెప్టెన్, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విరాట్ కోహ్లీ కరేబియన్ లెజెండ్ బ్రియాన్ లారాను అధిగమించాడు. ఆల్ టైమ్ కెరీర్ అత్యధిక ప్లేయర్ ర్యాంకింగ్స్ ఫర్ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. జొహన్నెస్‌బర్గ్ టెస్టు మ్యాచ్ తర్వాత కోహ్లీకి 12 పాయింట్లు లభించాయి. 900 పాయింట్లతో చివరి, మూడో టెస్టు ఆడిన కోహ్లీ 51, 41 పరుగులు చేయడంతో 12 పాయింట్లు వచ్చాయి. అంటే కోహ్లీ ఇప్పుడు 912 పాయింట్లతో ఆల్ టైమ్ జాబితాలో 26వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న స్టీవ్ స్మిత్ ఆల్ టైమ్ జాబితాలో 947 పాయింట్లతో ఉన్నాడు. 31 నుంచి 26వ స్థానానికి చేరుకున్న కోహ్లీ.. లారా (911), కెవిన్ పీటర్సన్ (909), హషీం ఆమ్లా (907), శివ్‌నరైన్ చందర్‌పాల్ (901), మైకెల్ క్లార్క్ (900)లను అధిగమించాడు. 916 పాయింట్లతో ఉన్న సునీల్ గవాస్కర్‌కు కోహ్లీ చేరువగా ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జూన్‌లో జరగనున్న ఏకైక టెస్టులో లేదా ఆ తర్వాత అంటే ఆగస్టు/సెప్టెంబర్ మాసాల్లో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లీ మరిన్ని పాయింట్లు సాధించే అవకాశముంది. ఐపీపీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎటువంటి మార్పూ లేదు. జేమ్స్ ఆండర్సన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. కగిసొ రబాడ, రవీంద్ర జడేజా, జోష్ హాజిల్‌వుడ్, రవీచంద్రన్ అశ్విన్ తర్వాతి ర్యాంక్‌ల్లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ టాప్-20లో స్థానం సంపాదించాడు. ఇషాంత్ శర్మ 26వ ర్యాంక్‌లో, బుమ్రా 36వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు