తిరుమల ప్రధాన ఆర్చకులు రమణ దీక్షితులు ప్రధాన అర్చక వృత్తిలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని టీడీపీ నేత, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ ఛైర్మన్ సాయిబాబా ఆరోపించారు. ఈ మేరకు అయన ప్రధాన కార్యదర్శి దినేష్ కుమారుకు ఫిర్యాదు చేసారు. ప్రధాన అర్చక పదవిలో ఉండి రమణ దీక్షితులు సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు లో పేర్కోన్నారు. ప్రధాన అర్చక వృత్తిలో ఉంటూ రమణ దీక్షితులు ఏయే వ్యాపారాలు నిర్వహించారనే వివరాలను చీఫ్ సెక్రటరీకు అందించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. రమణ దీక్షితులు చేసిన వ్యాపారాలు, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వ్యక్తులతో సంబంధాలను మరిన్ని బయటపెడతానని సాయిబాబా అన్నారు. రమణ దీక్షితులు ప్రధాన అర్చక వృత్తిలో ఉండి కొన్ని వ్యాపార సంస్ధలను ప్రారంభించారు. తిరుమల ఆఫీసర్స్ క్వార్టర్సును అడ్రస్సుగా పెట్టి వ్యాపార సంస్థలను ప్రారంభించారని అయన అన్నారు. తాను వ్యాపారాలు చేస్తున్నట్టు ఆధారాలుంటే నిరూపించాలని రమణ దీక్షితులు సవాల్ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని అన్నారు. రమణ దీక్షితులు ప్రధాన అర్చక పదవిలో ఉండి.. వ్యాపారాలు ఏ విధంగా చేస్తారని అయన ప్రశ్నించారు. ఇదే విషయమై ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశానని అన్నారు. ప్రధాన అర్చక వృత్తిలో ఉండి సర్వీస్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారు. రమణ దీక్షితులు ఎలాంటి వ్యాపారాలు చేయలేదని తిరుమల ధ్వజస్ధంభం దగ్గర ప్రమాణ చేసి చెప్పగలరా అని నిలదీసారు. అన్యమతస్తులతో, క్రిమినల్ రికార్డ్ ఉన్నవారితో కలిసి పని చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. రమణ దీక్షితులు వ్యాపారాలు చేశారనే అంశానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అయన అన్నారు. పెద్ద స్థాయిలో ఉండి వెంకన్న దర్శననానికి వచ్చే వారితో కలిసి రమణ దీక్షితులు వ్యాపారాలు చేశారు. తాను చేసిన తప్పులను క్షమించమని శ్రీవారిని వేడుకోకుంటే ఆయన చరిత్ర మరింతగా బయటపెడతానని సాయిబాబా హెచ్చరించారు.