పీఆర్సీ బకాయిలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపి ఎన్ జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు లక్షల మంది ఉద్యోగులకు 3920కోట్ల పీఆర్సీ బకాయిల విడుదల చేసినందుకు సీఎం కి కృతజ్ఞతలని అయన అన్నారు. పది పిఆర్సీలలో ఎప్పుడూ ఇలా వెంటనే చెల్లింపులు జరగలేదు. బకాయిలు విడుదలకు కృతజ్ఞతగా అమరావతి అభివృద్ధికి 15రోజుల అరియర్స్ 200కోట్లు విరాళంగా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన విషయం అయన గుర్తు చేసారు. రాజధానిలో కట్టే ఓ నిర్మాణానికి ఉద్యోగుల విరాళం నిధులు వెచ్చించమని సీఎం సూచించారు. తెలంగాణ లో డిసెంబర్ నాటికి బకాయిల చెల్లింపు పూర్తయితే ఏపి లో నవంబర్ నాటికే చెల్లింపు వుంటుందని అయన అన్నారు.