పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్షించారు. పంచాయితీ రాజ్ శాఖకు 8, ఐటీ శాఖకు 13, మంత్రి నారా లోకేష్ కు వ్యక్తిగంగా 1అవార్డు, జాతీయ స్థాయిలో మొత్తం 22 స్కోచ్ అవార్డులు సాధించినందుకు అధికారులను అభినందించారు. నాలుగేళ్ళలో ఆస్తుల కల్పన కోసం గ్రామాల్లో 20 వేల కోట్లు ఖర్చు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు శాఖను మెచ్చుకున్నారు. గ్రామాల్లో 17 వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు నిర్మించడం ఒక చరిత్ర. ఈ ఏడాది మరో 8 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించి 25 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించారు. రాబోయే మూడు సంవత్సరాలలో రోడ్డు మార్గంలేని గ్రామం అంటూ ఉండకూడదని అయన సూచించారు.