YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కపిల్ దేవ్ కు రాజ్యసభ సభ్యత్వం

కపిల్ దేవ్ కు రాజ్యసభ సభ్యత్వం
 ఇటీవలే సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియగా, ఇప్పుడు మరో లెజెండరీ క్రికెటర్ పెద్దల సభలో అడుగుపెట్టనున్నాడా? ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయా? అంటే ఔననే అంటున్నాయి మీడియా వర్గాలు. ఈ మేరకు ఒక ప్రముఖ ఆంగ్లదినపత్రిక ఒక కథనాన్ని రాసింది. దాని ప్రకారం త్వరలోనే భారతక్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారు. రాష్ట్రపతి ఎంపిక చేసే వారి జాబితాలో కపిల్ దేవ్ పేరు ఉండబోతోందని ఒక ప్రముఖ పత్రిక పేర్కొంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ చొరవ చూపుతున్నట్టుగా ఆ పత్రిక పేర్కొంది. రాష్ట్రపతి ఎంపిక చేసే రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభిప్రాయానికి అనుగుణంగా ఉండటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్‌ను పెద్దల సభకు పంపాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టుగా ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఇటీవలే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కపిల్ దేవ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాజ్యసభ సభ్యత్వం ప్రస్తావన వచ్చిందని.. కపిల్‌కు షా ఆ హామీ ఇచ్చారని ఆ పత్రిక పేర్కొంది. కేవలం కపిల్ దేవ్‌ను మాత్రమే కాదు, మరో సెలబ్రిటీని కూడా షా కలిశారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లి షా సమావేశం అయ్యారు. ఆమెకు కూడా రాజ్యసభ సభ్యత్వ హామీని ఇచ్చారని... రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యే రాజ్యసభ సభ్యుల్లో మాధురీ దీక్షిత్ పేరు కూడా ఉండబోతోందని సమాచారం. 

Related Posts