ఆంధ్ర ప్రదేశ్‌లో భాగమైన ఉత్తరాంధ్ర మరో తెలంగాణ కావడానికి మరెంతో దూరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఈ విధంగా స్పందించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ‘ఉత్తరాంధ్ర’ మాసపత్రికలో 2017 సెప్టెంబర్‌లో వచ్చిన కవర్ స్టోరీని ఉదహరిస్తూ ఆయన ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ ఉద్యమం మరింత ప్రభలే అవకాశం ఉందని కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రపై ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే.. మరో తెలంగాణ అవుతుందనడంలో ఎలాంటి అతిశశయోక్తి లేదు’ అంటూ ట్వీట్ చేశారు. దానితో పాటు ఉత్తరాంధ్ర మాసపత్రికలోని రెండు సంచికల చిత్రాలను షేర్ చేశారు. ‘థింసా’ సామాజిక మాస పత్రిక, ‘తెలుగు సీమ’ ఆంగ్ల మాసపత్రికల చిత్రాలను కూడా షేర్ చేశారు.జనసేన పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ మధ్యే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం గ్రామంలో కిడ్నీ బాధితుల గురించి విశేష కృషి చేశారు.