వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర.. ప్రజాసంకల్ప యాత్ర...200ల రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇది ఏ పార్టీలోనో.. వైసీపీలోనో .. ఒక రిద్దరు నేతల్లోనో అయితే, బాగానే ఉండేది. కానీ, రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ కనిపించనున్న పండగే.,. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్న ఆదరణే. దీనికి ప్రధానంగా ఒక పార్టీ అధినేత నిర్విరామంగా.. నిరాఘాటంగా అలుపెరుగకుండా ప్రజల కోసం నిర్వహిస్తున్న పాదయాత్ర కావడమే. నిజానికి రాష్ట్రంలో ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న పాలకుడు ఉండి కూడా తమకు ఎలాంటి భరోసా కనిపించడం లేదని, అన్నీ జన్మభూమి కమిటీల వారికే పనులు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అంతేకాదు, టీడీపీ నేతల ఆగడాలతో ప్రభుత్వ పథకాలకు సైతం దూరమవుతున్నారు.ఇలా ప్రజలు తమకు ఎక్కడా స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నేనున్నానంటూ.. జగన్ ముందుకు వచ్చారు. వారికి భరోసా ఇచ్చారు. రాజన్న రాజ్యాన్నితిరిగి తీసుకువస్తానని ప్రకటించారు. ప్రజలకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. నిజానికి చంద్రబాబు చెబుతున్నట్టు ప్రజల్లో 75 శాతం ప్రభుత్వంపై సంతృప్తి ఉండి ఉంటే.. జగన్ వెంట జనాలు ఎందుకు ఎండనక, వాననక తిరుగుతారు? ఎందుకు వారు జగన్‌కు జైకొడతారు? వంటి కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. నిజానికి జనాల్లో జగన్‌పై ఉన్న అభిమానమే వేరు.. అని అనిపించే రేంజ్‌లో పాదయాత్రకు ప్రజలు తరలి వస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఉద్యోగుల్లోనూ అసంతృప్తి పెరుగుతుండడం గమనార్హం. మొత్తంగా ఈ పరిణామం పైకి ఎలా ఉన్నప్పటికీ.. వారు మాత్రం.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగుల్లోనూ ప్రభుత్వంపై భరోసా లేకపోగా.. అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ ప్రభుత్వం మాకు వద్దు మహాప్రభో అనే రేంజ్‌లో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే, మీడియాను మేనేజ్ చేయడంలో ఫస్ట్ ఉండే చంద్రబాబు.. ప్రభుత్వంలోని లోపాలను సరిచేయడంలో వీటిని తమకు అనుకూలంగా వినియోగించుకుని ప్రజల్లో సంతృప్తి ఇంత ఉంది. అంత ఉందని ప్రచారం చేయించుకుంటున్నారనే ప్రజలే చర్చించుకుంటున్నారు.అధికార పార్టీలోని లోపాలే ప్రజలను వైసీపీ వైపు మళ్లిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా వైసీపీ, జగన్ రాజకీయం అయితే ఏపీలో ఆసక్తికరంగా మారింది.