వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో 14,079మంది రైతు ఆత్మహత్యల పాలన మళ్లి తెస్తారా అని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. కరెంటు లేక నెలకు 15రోజులు పరిశ్రమలు మూతపడిన పాలన తెస్తారా అని అడిగారు. 11లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డ పాలన తెస్తారా అన్నారు. ఒక బస్తా ఎరువుకు రెండు లాఠీ దెబ్బలు ఉచితం పాలన తెస్తారా అన్నారు. పోలీస్ స్టేషన్లలో విత్తనాలు పంపిణీ చేసిన పాలన తెస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నాన్నగారి పాలన కంటే గొప్ప పాలన అంటే ఏంటో చెబుతారా..? జగన్మోహన్ రెడ్డి గారూనిలదీసారు. ధనయజ్ఞంగా మార్చిన జలయజ్ఞం పాలన తెస్తారా.. రాత్రికి రాత్రే రూ.350కోట్ల ఎస్టిమేట్లు పెంచిన ఎల్లంపల్లి ప్రాజెక్టు పాలన తెస్తారా..అని అడిగారు. జగన్ కంపెనీ రూ.10షేర్ రూ.1440కు, రూ.350కు అమ్ముకున్న పాలన తెస్తారా..? ‘గాలి’(జనార్దన్ రెడ్డి)కి ఇచ్చిన భూములు తాకట్టు పెట్టి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే పాలన తెస్తారా..? కాకరాపల్లి, సోంపేట, ముదిగొండలో 12మంది రైతు కూలీలను కాల్చిచంపిన పాలన తెస్తారా..? అని ప్రశ్నించారు. వాటాల కోసం పారిశ్రామికవేత్తలను బెదిరించి పారిపోయేలా చేసిన పాలన తెస్తారా..? ఐఏఎస్ అధికారులను జైలుపాలు చేసిన రాజన్న రాజ్యం తెస్తారా..? 200మంది పైగా టిడిపి కార్యకర్తలను హతమార్చిన రాక్షస రాజ్యం తెస్తారా అని అడిగారు.