YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆగని జీఎస్టీ అక్రమాలు

ఆగని జీఎస్టీ అక్రమాలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను వ్యాపారులు సక్రమంగా చెల్లించడం లేదు. మెజారిటీ వ్యాపార సంస్థలు పన్నును ఎగ్గొట్టేందుకే ప్రయత్నిస్తున్నాయి. జీఎస్టీ దర్యాప్తు విభాగం రెండు నెలల్లో రూ.2 వేల కోట్లకుపైగా ఎగవేతల్ని గుర్తించింది మరి. అంతేగాక జీఎస్టీ కింద నమోదైన వ్యాపార సంస్థల్లో దాదాపు ఒక్క శాతం సంస్థల ద్వారానే 80 శాతం పన్ను ఆదాయం లభిస్తున్నదని తేలింది. జీఎస్టీ ఇంటిలిజెన్స్ డైరెక్టర్ జనరల్, సీబీఐసీ సభ్యుడు జాన్ జోసెఫ్ వివరాల ప్రకారం జీఎస్టీ రిటర్నుల దాఖలులో సహజంగా చిన్నపాటి సంస్థలు తప్పులు చేస్తుంటాయని, కానీ బడా, బహుళజాతి కార్పొరేట్ సంస్థలూ వాస్తవాలను మరుగున పెడుతున్నాయని వెల్ల‌డైంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 1.11 కోట్లకుపైగా జీఎస్టీ నమోదిత సంస్థలున్నా.. పన్ను ఆదాయంలో 80 శాతం వాటా చెల్లింపు లక్ష మంది(1%) కూడా లేని వ్యాపారుల ద్వారానే జ‌రుగుతోంద‌ని జోసెఫ్ తెలిపారు.మిగతా సంస్థలు పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని, రెండు నెలల్లో రూ.2,000 కోట్లకుపైగా ఎగవేతలు వెలుగుచూడటమే ఇందుకు నిదర్శనమని బుధవారం ఇక్కడ జరిగిన ఓ అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చెప్పుకొచ్చారు. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను పేరుతో 1,200ల వస్తువులను, 500లకుపైగా సేవలను కలిపి గతేడాది జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీని మోదీ సర్కారు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. చాలా ప‌రోక్ష ప‌న్నుల బ‌దులు వాటి స్థానంలో జీఎస్టీని ప్రవేశపెట్టారు. 0, 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ వస్తువులు, సేవలకు పన్నులను విధించగా, విద్య, వైద్యం, తాజా కూరగాయాలు, పలు ఆహారోత్పత్తులకు జీఎస్టీ మినహాంపులు క‌ల్పించారు. 

Related Posts