YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

125 రూపాయిల కాయిన్ విడుదల చేయనున్న వెంకయ్య

125 రూపాయిల కాయిన్ విడుదల చేయనున్న వెంకయ్య
ప్రముఖ ఆర్థిక గణాంక నిపుణుడు, రెండో పంచవర్ష ప్రణాళిక నమూనా రూపకర్త పీసీ మహలనోబిస్‌ జయంతిని ' జాతీయ గణాంక దినోత్సవం'గా నిర్వహిస్తారు. జూన్ 29 న మహలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం రూ.125 నాణెం, కొత్త రూ.5 నాణేలను కేంద్రం విడుదల చేయనుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీటిని శుక్రవారం విడుదల చేయనున్నారు. సామాజిక-ఆర్థిక ప్రణాళికలు, విధానాల రూపకల్పనలో గణాంకాల ప్రాధాన్యతను దేశ ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సారి మహాలనోబిస్‌ జయంతి వేడుకని కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. భారత ప్రణాళిక వ్యవస్థకు జవహర్ లాల్ నెహ్రూ పితామహుడు అయితే, దానికి నిర్దేశకుడిగా మహలనోబిస్ గుర్తింపు పొందారు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నమూనా మహలనోబిస్ నమూనాగా ప్రసిద్ధిగాంచింది. 1955 నుంచి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగానూ తన సేవలందించారు. ఏటా మహలనోబిస్ జయంతి సందర్భంగా జాతీయ ప్రాముఖ్యతను అనుసరించి ఓ నిర్దిష్ట అంశాన్ని ఎంపికచేసి దానిని మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలు గురించి చర్చిస్తారు. ఈ ఏడాది కూడా ‘క్వాలిటీ ఎష్యూరెన్స్ ఇన్ ఆఫీషియల్ స్టాటిస్టిక్స్’అనే అంశం గురించి చర్చించనున్నారు. 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌‌ను ప్రారంభించిన మహలనోబిస్, దీన్ని స్వయంప్రతిపత్తి సంస్థగా ప్రకటించారు. అయితే దేశ ప్రాముఖ్యత దృష్ట్యా 1959లో దీనిని జాతీయ సంస్థగా కేంద్రం ప్రకటించింది. పార్లమెంటులో ప్రత్యేక చట్టం ద్వారా ఐఎస్ఐ‌ను కేంద్ర గణాంక సంస్థగా గుర్తించారు. 

Related Posts