ఈశాన్య రాష్ట్రాల్లో చొరబడేందుకు ప్రయత్నాలను చైనా ముమ్మరం చేస్తోందని మాజీ జీఓసీ ఇన్ సీ ఈస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ జేఆర్ ముఖర్జీ చెప్పారు. డోక్లాం స్టాండాఫ్ తర్వాత చైనా ఈ దుష్ట పన్నాగానికి ఇప్పటికే పావులు కదుపుతోందని ఆయన హెచ్చరించారు. చైనాకు భారత్ పీడకలలా మారినప్పుడల్లా లేదంటే ఇరు దేశాల మద్య సరిహద్దు సమస్యలు తలెత్తినప్పుడల్లా.. ఈశాన్య రాష్ట్రాలపై చైనా పడుతుందని, చొరబాటుదారులను పంపిస్తుందని ఆయన విలేకరులకు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా చొరబాటుకు పాల్పడుతుందనడానికి ఇప్పటికే పలు సూచనలు కనిపిస్తున్నాయని, దానికి పక్కా ఆధారాలున్నాయని ఆయన సూచించారు. డోక్లాం స్టాండాఫ్ లాంటి వివాదాలు చైనాకు కొత్తేమీ కాదని, ఆ దేశ ప్రయోజనాల కోసం పరాయి దేశాల ప్రయోజనానలు పణంగా పెడుతూ ఆ దేశ సైన్యం ఎప్పుడూ సరిహద్దుల వద్ద శిబిరాలు ఏర్పాటు చేస్తుంటుందని చెప్పారు. డోక్లాం అంశంలోకి భూటాన్ వాళ్లను కూడా చైనా లాగి తన ప్రయోజనాలను దక్కించుకుంటుందని హెచ్చరించారు.