YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం..పాలిట్రిక్స్..

పోలవరం..పాలిట్రిక్స్..
పోలవరం.. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక నీటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే.. రాష్ట్రం పసిడి పంటలకు కేంద్రమవుతుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ పై మరోసారి రాజకీయ నీలినీడలు కమ్ముకుంటున్నాయన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ..ఒడీసా సీఎం నవీన్ పట్నాయర్ మళ్లీ కేంద్రానికి లేఖ రాయడంతో ఈ ఇష్యూ ఇంపార్టెన్స్ సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టుపై ఒడిసా, ఛత్తీస్ గఢ్‌ ముందు నుంచీ  అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2015లో నిర్మాణ పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌..ఎన్‌జీటీ.. ‘స్టాప్‌ వర్క్‌’ ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ఈ ఆదేశాలపై 2016లో స్టే ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో.. 2017 జూన్‌ 2వరకూ ప్రాజెక్ట్ పనులు కొనసాగించగలిగారు. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. కేంద్రమంత్రి జవదేకర్ సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగేది. అయితే.. ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జవదేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన అనిల్‌ దవే స్టే కాలపరిమితిపై సందేహాలు వ్యక్తం చేసి.. చివరకు స్టాప్‌ ఆర్డర్‌పై స్టేను ఏడాదికే పరిమితం చేశారు. దీంతో జూలై 2వ తేదీతో స్టే గడువు ముగియనుంది. స్టే పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. పొడిగించవద్దని ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సైతం ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్రీయంగా టీడీపీ-బీజేపీల మధ్య మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రానికి జల జీవనాడి అయిన పోలవరంకు అడ్డంకులు ఎదురవుతున్నా కీలకమైన ఈప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఇబ్బందులు పెట్టిందని విపక్షం వైసీపీ కూడా ప్రాజెక్టును ఆపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఇటీవలే వ్యాఖ్యానించిన సీఎం.. అడ్డంకులు అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని వ్యవసాయానికి పట్టుగొమ్మగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేకున్నా.. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి.. రాష్ట్ర వ్యవసాయరంగాన్ని పటిష్టం చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో స్టాప్ వర్క్ ఉత్తర్వుపై ఇచ్చిన గడువు తుది దశకు చేరుకోవడంతో.. సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తుందో లేక చంద్రబాబుపై అసంతృప్తితో పోలవరంకు బ్రేక్ వేస్తుందో వేచి చూడాలి. పోలవరం జలాశయంలో 2018నాటికి నీటిని నిలబెట్టి కాలువలకు విడుదల చేసి, 2019 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితమివ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. అందుకనుగుణంగా ప్రతి సోమవారం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని సమీక్షిస్తోంది. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తూ ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటోంది. నవ్యాంధ్రప్రదేశ్‌కు సాగు, విద్యుత్‌, పారిశ్రామిక రంగాల్లో విశేష ప్రయోజనం కలిగించే ఈ ప్రాజెక్టు ఆవిష్కారమైతే...తెలుగువారికి అపురూప వరం చేతికందినట్లే. ఇంతటి కీలకమైన ప్రాజెక్ట్ కు అవాంతరాలు సృష్టించవద్దని.. ప్రాజెక్ట్ పనులు సాఫీగా సాగేలా మద్దతునివ్వాలని రాష్ట్రవాసులు కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నారు.
-------------------------------  
83. సాగునీటికి తొలగిన ఇక్కట్లు
ఆదిలాబాద్‌, జూన్28, 2018 (న్యూస్ పల్స్)  
ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల జలాశయాన్ని పటిష్టం చేసి.. వ్యవసాయానికి ఊతమిచ్చేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ ఆధునికీకరణకు ప్రాధాన్యతనిస్తోంది. పనులకు అవసరమైన నిధులు సైతం విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే సాగునీటి రంగానికి పెద్దపీట వేసే దిశగా నూతన ప్రాజెక్టులతో పాటు పాత ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారీగా నిధుల మంజూరు చేశారు. సాత్నాల కాలువల సీసీ లైనింగ్‌ నిర్మాణం పూర్తయితే రబీ సీజన్‌లో పంటలకు సాగునీరు అందుతుందని, ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు అవసరమని నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. గతేడాది జులై 6న మంత్రి హరీష్‌రావు నీటి పారుదల శాఖపైనా సమీక్షించారు. ఈ నిధుల విషయమై మంత్రి జోగు రామన్న మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జులై 29న రూ.28.60 కోట్లు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో సాత్నాలకు మహర్దశ పట్టనుందని.. స్థానిక రైతులకు పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. 
సాత్నాల జలాశయాన్ని 1976లో మంజూరుచేశారు. 1977లో జైనథ్‌ మండలం సాత్నాల వాగుపై జలాశయాన్ని నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అపరిష్కృత ప్రాజెక్టులకు భారీగా నిధులు ఇస్తోందిది. దీనిలో భాగంగానే సాత్నాల జలాశయానికి నిధులు మంజూరయ్యాయి. మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తూ పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. సాత్నాల జలాశయం నుంచి కుడి కాలువ ద్వారా లక్ష్మీపూర్‌ జలాశయంలోకి వరదనీరు చేరుతుంది. ఏళ్ల తరబడి సీసీ కాలువలు పూర్తికాక పోవడంతో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం కాలువల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ కాలువల నిర్మాణంతో 6వేల ఎకరాలకు పైగా సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. నిధుల లేమితో ఈ జలాశయం నుంచి నీరు సమర్ధవంతంగా అందేదికాదు. మరమ్మతులకు నోచుకోక అస్తవ్యస్తంగా ఉండేది. సాత్నాల చివరి ఆయకట్టు వరకు సాగునీరందించని దుస్థితి ఉండేది. ప్రస్తుతం సర్కార్ రూ.28.60 కోట్లతో నిధులు విడుదల చేయడంతో మరమ్మతులు, కాలువల నిర్మాణం పూర్తి చేశారు. రైతులకు 24 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించనున్నారు.

Related Posts