రోజా, అల్లరిప్రియుడు, జంటిల్మెన్ వంటి చిత్రాల ద్వారా అలరించిన కథానాయిక మధుబాల తాజాగా విలన్ పాత్రలో నటించనుంది. బాబీ సింహా హీరోగా తమిళంలో రూపొందుతున్న 'అగ్నిదేవ' చిత్రంలో మధుబాల విలన్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఆమె తెలుగు లో 'సూర్య vs సూర్య' చిత్రం లో నిఖిల్ తల్లి గా నటించింది.
మధు బాల సెకండ్ ఇన్నింగ్స్ లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.