సినిమా పేరు: సంజు
నటీనటులు: రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, మనీశా కోయిరాలా, పరేశ్ రావల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, దియా మీర్జా, టబు, షియాజీ షిండే తదితరులు
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్(సంజయ్ నటించిన సినిమాలోని పాటలు కూడా వాడారు)
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
కూర్పు: రాజ్‌కుమార్ హిరాణీ
నిర్మాణ సంస్థలు: రాజ్‌కుమార్ హిరాణీ ఫిలింస్
నిర్మాతలు: విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరాణీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరాణీ
విడుదల తేదీ: 29-06-2018
బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో ఎన్నో బయోపిక్‌లు వచ్చాయి కానీ..‘సంజు’ బయోపిక్‌పై ఉన్న అంచనాలు మరే సినిమాపై లేవనే చెప్పాలి. సంజయ్ దత్ జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కించాలనుకుంటున్నట్లు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ప్రకటించినప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ట్రైలర్‌తో, పోస్టర్లతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రెట్టింపైంది. మొత్తానికి ‘సంజు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘సంజయ్ గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ బయోపిక్‌తో అతనేంటో అర్థమవుతాడు’ అని హిరాణీ ఎన్నోసార్లు చెప్పారు. మరి రణ్‌బీర్..సంజయ్ పాత్రకు న్యాయం చేశాడా? సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే: సంజయ్ దత్(రణ్‌బీర్ కపూర్) తన జీవితాధారంగా రాసిన బయోగ్రఫీని చదువుతున్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. ఆ బయోగ్రఫీలో ఓ చోట తనను మహాత్మా గాంధీతో పోలుస్తూ రాసుంటుంది. ఆ తర్వాత సినిమా వేగంగా సంజయ్ జీవితంలోకి వెళ్లిపోతుంది. కథానాయకుడిగా సంజయ్ అందుకున్న విజయాలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎఫైర్స్, మాదక ద్రవ్యాలకు అలవాటుపడటం.. ఇలా ఆయన జీవితంలోని ఒక్కో అంశాన్ని చూపించారు దర్శకుడు హిరాణీ.
బలాలు:
+ రణ్‌బీర్‌కపూర్, మనీశా, పరేశ్ నటన
+ కథనం
+ సంగీతం
బలహీనతలు:
-అక్కడక్కడా అనవసరమైన సన్నివేశాలు
చివరగా: రణ్‌బీర్..మరో ‘సంజు’