ప్రముఖ భారత మొబైల్ టెలికం సంస్థలు తమ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడూ డేటా ఆఫర్లను సవరిస్తూ కొత్త ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ అందించే భారీ డేటా ఆఫర్లతో పోటీపడేందుకు ఇప్పుడు వోడాఫోన్ కూడా తమ డేటా ప్లాన్లను సవరించింది. అందులో భాగంగా వోడాఫోన్ రూ.198 ప్రీపేయిడ్ ప్యాక్‌ను సవరిస్తూ రోజుకు 1.4జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాక్‌లో కూడా అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల చొప్పున అందిస్తోంది. అయితే డేటా ప్లాన్ పరిమిత కాలం మాత్రం 28రోజులను అలాగే ఉంచింది. ఇక ఎయిర్‌టెల్ రూ.199 ప్యాక్, రిలయన్స్ జియో రూ.149 ప్యాక్‌ల్లో ఈ ఆఫర్లను అందిస్తున్నాయి.
గతంలో రూ.198 ప్యాక్‌పై వోడాఫోన్ ప్రీపేయిడ్ వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా చొప్పున అందించగా, అందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు), రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందించింది. తాజాగా ఈ ప్లాన్‌ను వోడాఫోన్ సవరించి 1.4జీబీ డేటాను అందిస్తోంది. ఇటీవల వోడాఫోన్ రూ.458, రూ.509 ప్రీపేయిడ్ ప్యాక్‌లపై అదనపు డేటా ఆఫర్లను ప్రవేశపెట్టింది. వాటిలో రూ.458 డేటా ప్లాన్‌పై (84రోజుల కాలపరిమితితో 1జీబీ డేటా) మొత్తం పరిమితి 84జీబీ వరకు అదనంగా అందిస్తోంది. ఇక రూ.509 డేటా ప్యాక్‌లో కూడా అదే డేటా పరిమితితో 91రోజుల కాలపరిమితిపై (మొత్తం 91జీబీ) వరకు అందిస్తోంది. ఈ రెండు ప్యాక్‌ల్లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, మెసేజ్‌లను వోడాఫోన్ షరతులతో అందిస్తోంది.