సినీ నటుడు శరత్ కుమార్ పై తమిళనాడులోని కాంచిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘానికి చెందిన స్థలాన్ని విక్రయించిన వ్యవహారంలో వీరిపై కేసు నమోదైంది. గతంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగి శరత్ కుమార్, కోశాధికారిగా రాధారవిలు ఉన్న సమయంలో పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వీరిపై కేసు నమోదైంది.