YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రరాజకీయాలు

రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రరాజకీయాలు
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోది బిజేపి ఆగ్రనేత అమిత్ షా కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నారని ఏలూరు ఎంపి మాగంటి బాబు ఆరోపించారు. స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ చాంబర్ లో శుక్రవారం ఎంపి ల బృందంతో కలిసి మాగంటి బాబు విలేఖర్లతో మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపర్చిన 18 అంశాలలో ఏఒక్కటి కూడా కేంద్రం అమలుపర్చలేదని ఆరోపించారు. నాలుగేళ్లు ప్రభుత్వంతో ఎంతో సహనం ఓపికతో పనిచేశామని అయినాసరే మోదీ, అమీత్ షా అడుగడునా కపట ప్రేమ చూపించారే తప్ప రాష్ట్ర అభివృద్దికి సహకరించలేదని బాబు ఆరోపించారు. రాష్ట్రంలో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంపి సియం రమేష్ ఆమరణ నిరాహార దీక్షచేస్తూ నేటికి 10 రోజులు అయినా కేంద్రం సానుకూలంగా స్పందించలేద ని ఆయన అరోపించారు. అమిత్ షా, మోధీ ధనం వెదజల్లి ఎన్నికల్లో బిజెపి ప్రభంజనం అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని కాని వాస్తవంగా బిజెపి కి ప్రజాబలం లేదని బాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విడదీస్తే బిజెపి న్యాయం చేస్తుందని ఆశించామని, కాని అడుగడుగునా కష్టాలు తప్ప నిధుల విడుదల లేదని ఆరోపించారు. ఎన్నోఏళ్లుగా శిలాఫలకాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును ముందుకు న డుపుతూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తున్నచంద్రబాబును తెలంగాణా సియం కసిఆర్ అభినందించడం గొప్ప విషయమని చెప్పారు. 2019 ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీనే గెలిపించాలన్న ఆలోచనలో ప్రజలు పడ్దారని బాబు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో ఎయిర్ పోర్టులు, పోర్టులు , నూతన కంపెనీలు పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తుంటే చెడగొట్టడానికి ప్రయత్నాలు చేయవద్దని బాబు ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మురళీ మోహన్ మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తూ ఎంపిల బృందంనిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర గనులశాఖమంత్రిని కలవడం జరిగిందని కొన్ని అభ్యంతరాలను వ్యక్తంచేయడంతో వాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పామని, కడపలో ఉక్కు ప్యాక్టరీ నిర్మాణానికి మంత్రి అంగీకరించారని అయితే వ్రాతపూర్వక హామీ ఇవ్వకపోవడంతో కడపలో దీక్షచేస్తున్న సియం రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, ఇప్పటికైనా ప్రధాని దిగివచ్చి కడప ఉక్కు స్టీల్ ప్లాంట్ ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ ఉత్తర భారతంలో కులాల మధ్య, మతాల మధ్య జరిగే ఘర్షణలను ద క్షిణ భారతానికి కూడా వ్యాపింపచేయడానిక అమీత్ షా, మోదీలు కుట్రలు చేస్తున్నారని ఈ విషయంలోప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు. ప్రతిపక్షనేత ఇప్పటికైనా నోరుతెరచి కేంద్రంపై పోరాటానికి పిలుపు ఇవ్వాలే తప్ప అడుగడుగునా ఆంధ్రప్రదేశ్ కు అవరోధాలు కల్పించే ప్రధానికి వక్తాసు పలకవద్దని జగన్ ను, పవర్ కళ్యాణ్ ను కోరారు. జడ్ పి చైర్మన్ ముళ్టపూడి బాపిరాజు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాబు ఎంపిలకు జడ్‌పిటిసిలు ఎంపిపిలకు స్వీట్ లు ఇతర కానుకల కిట్లను అందజేశారు.

Related Posts